Main Menu

ప‌వ‌న్ ఫ్లెక్సీ చుట్టూ వివాదం..!

politcs flags
Spread the love

అస‌లే నిత్యం కులాల కుంప‌టి కింద క‌నిపించే బెజ‌వాడ‌లో మ‌రో స‌మ‌స్య తెర‌మీదకు వ‌చ్చింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లెక్సీ చుట్టూ వివాదం మొద‌ల‌య్యింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లెక్సీ చించేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఇప్పుడు క‌ల‌క‌లం మొద‌ల‌య్యింది. భవానీపురం శివాలయం సెంటర్‌లో ఏర్పాటు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయ‌డం వివాదానికి దారితీస్తోంది. శివాలయం సెంటర్‌కు చెందిన జనసేన అభిమానులు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు మూడు రోజుల క్రితం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.

విషయం తెలుసుకున్న పవన్‌ అభిమానులు స్థానిక 28వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.దాంతో వ్య‌వహారం ఎ టు మ‌ళ్లుతుందోన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది.






Related News

SBICBI

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

somu, gorantla

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *