Main Menu

ధోనీకి షాకిచ్చిన కశ్మీరీలు

Spread the love

టీమిండియా స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ కశ్మీర్ లో పర్యటించాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీ ప్రారంభానికి హాజరయ్యాడు. కానీ హఠాత్తుగా ఆయనకు స్థానిక యువకులు షాకిచ్చారు. ఏకంగా ధోనీ సమక్షంలోనే నినాదాలు అందుకున్నారు.ముఖ్యంగా కశ్మీర్‌ ఏర్పాటువాదులు కొందరు రెచ్చిపోయారు. ధోని పర్యటనలో వ్యతిరేక నినాదాలతో గొంతు చించుకున్నారు. స్థానిక యువతను ప్రోత్సహిస్తూ భారత సైన్యం ప్రత్యేక క్రికెట్‌ టోర్నమెంట్‌ ఏర్పాటు చేసింది. ధోని ఒక ఆర్మీ అధికారిగా టోర్నమెంట్‌ను సందర్శించడానికి ధోని వెళ్లారు. అంతే కాకుండా అక్కడి క్రికెటర్లతో చాలాసేపు చర్చించారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి భారత్‌ తరపున ఆడాలంటూ ప్రోత్సహించారు.

అయితే ఈపర్యటనలో అనుకోని విధంగా ధోనికి చేదు అనుభవం ఎదురైంది. ధోని వచ్చే సమయంలో కొంత మంది ఏర్పాటువాద యువకులు రెచ్చిపోయారు. పాకిస్తాన్‌ ఆటగాడు ఆఫ్రిదికి అనుకూలంగా ‘భూమ్‌ భూమ్‌ ఆఫ్రిది’ అంటూ నినాదాలు అందుకున్నారు. దీనిపై స్పందించిన అధికారులు వారిని అడ్డుకొన్నారు. అయితే ఈ వివాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఇప్పుడు ఈవీడియో వైరల్‌ అయింది.

ఇప్పటికే రెండు దేశాల మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగడంలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో తప్ప ప్రత్యేకంగా సిరీస్‌లు ఆడింది లేదు. అయినా రెండు దేశాల ఆటగాళ్ల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పలు సందర్భాల్లో ఈ విషయం వెల్లడైంది.






Related News

రెండో పెళ్లి చేసుకోవ‌చ్చు..!

Spread the loveరెండో పెళ్లి విష‌యంలో సుప్రీంకోర్ట్ ఆస‌క్తిక‌ర తీర్పు వెలువ‌రించింది. రెండో పెళ్లి చేసుకోవ‌డంపై అభ్యంత‌రాల‌ను తోసిపుచ్చింది. అందుకుRead More

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *