Main Menu

హెరిటేజ్ పాలు తాగి ఆస్ప‌త్రి పాలు..!

heritage curd
Spread the love

హెరిటేజ్ పెరుగు ఆ ఇంట్లో ఆందోళ‌న క‌లిగించింది. ఏకంగా ఓ బాలుడు ఆస్ప‌త్రి పాలుకావాల్సి వ‌చ్చింది. ఫెవికాల్ ని మించిన గ‌ట్టిద‌నంతో క‌నిపించిన ఆ పెరుగు ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో హెరిటేజ్‌ పాలు తాగిన ఏడాది బాలుడు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికావ‌డం కలకలం రేపింది. ఆ బాలుని తండ్రి ఇవి పాలా, పెరుగా? హెరిటేజ్‌ గమ్మా? అంటూ ఆ సంస్థ మార్కెటింగ్‌ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక హెరిటేజ్‌ ప్లాంట్‌లో శుక్రవారం రాత్రి గౌస్‌ రెండు పాల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. వాటిలో ఒక ప్యాకెట్‌ పాలను ఆయన భార్య పెరుగుగా వాడుకునేందుకు తోడు పెట్టారు.

మరో ప్యాకెట్‌ పాలను ఉదయం వారి కుమారుడు రెహెన్‌(1)కు ఇచ్చేందుకు ఫ్రిజ్‌లో పెట్టారు. ఉదయాన్నే పాలు కాచి పట్టించగా, రెహెన్‌కు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి పరుగులు తీశారు. ప్రస్తుతం రెహెన్‌ ఆస్పత్రిలో కోలుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లి గౌస్‌ భోజనం చేస్తుండగా పెరుగు వేసుకుందామని గిన్నెలో గరిటె పెడితే బయటకు రాలేదు. గమ్‌లా పెరుగు గరిటెను పట్టుకుని వదల్లేదని గౌస్‌ వివరించారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన హెరిటేజ్‌ ప్లాంట్‌కు వెళ్లి అమ్మకందారును నిలదీశారు.

ఆయన మార్కెటింగ్‌ మేనేజర్‌ ఫోన్‌ నంబరు ఇవ్వడంతో ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హెరిటేజ్‌ అసిస్టెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఎస్‌.బాబి వచ్చి ఆ పెరుగును పరిశీలించారని గౌస్‌ చెప్పారు. ఆయనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తోడు పెట్టిన పెరుగును, ప్యాకెట్లను పరిశీలనకు పంపుతానని చెప్పి వెళ్లారని వివరించారు. దాంతో ఇప్పుడీ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగ‌తా మారింది.

వాస్త‌వానికి హెరిటేజ్ నాణ్య‌త మీద ప‌లు ఆరోప‌ణ‌లున్నాయి. కేర‌ళ వంటి రాష్ట్రాల్లో నిషేధం వ‌ర‌కూ వ‌చ్చింది. ఈలోగా ఏపీలో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప్ర‌స్తుతం హెరిటేజ్ 25వ‌సంతాల వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఆ సంద‌ర్భంగా నారా బ్రాహ్మ‌ణి రాష్ట్ర‌మంతా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అలాంటి స‌మ‌యంలో ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డం విశేషంగానే భావించాలి.


Related News

SBICBI

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

somu, gorantla

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *