అడ్డంగా బుక్కయిన అమిత్ షా

amit-shah_6a8d88ac-80f5-11e7-b63c-9d281adafd5e
Spread the love

బీజేపీ ఆలిండియా ప్రెసిడెంట్ అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన కామెంట్స్ ఆయన మెడకు చుట్టుకున్నాయి. తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవినీతికి సంబంధించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కర్ణాటక బీజేపీ నేతలను ఖంగుతినిపించాయి. పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం గురించి అమిత్ షా చేసిన చేసిన ట్వీట్ ఆపార్టీ పరిస్థితిని దిగజారుస్తోందనే ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా ఎడ్యూరప్ప అని అత్యంత అవినీతిపరుడిగా అమిత్ షా పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ కి ఓ పెద్ద ఆయుధంగా మారిపోయింది. దాంతో కాషాయదళం కలవరపడుతోంది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. బీజేపీపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో షా మీడియాతో మాట్లాడిన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ‘ఈ మధ్యే ఓ రిటైర్డ్‌ సుప్రీం కోర్టు జడ్జి దేశంలో పెరిగిపోయిన అవినీతి గురించి మాట్లాడారు. ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో యాడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైందని ఆయన తెలిపారు’ అంటూ అమిత్‌ షా చెప్పుకొచ్చారు. అయితే పక్కనే ఎడ్యూరప్ప ఈ విషయాన్ని గ్రహించి, మరో నేత ద్వారా షాకి తెలిపారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాను అన్నది సిద్ధిరామయ్యనని షా చెప్పుకున్నా టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘షా చివరికి నిజం మాట్లాడారు’ అంటూ సందేశాన్ని ఉంచారు. దాంతో ట్విట్టర్ లో అమిత్ షాని జనం ఆడుకుంటున్నారు. అడ్డంగా బుక్కయిన తర్వాత ఇప్పుడు నాలుక్కరుచుకున్నప్పటికీ అమిత్ షాకి పెద్దగా ఉపయోగం ఉండదనే చెప్పవచ్చు.


Related News

amit-shah_6a8d88ac-80f5-11e7-b63c-9d281adafd5e

అడ్డంగా బుక్కయిన అమిత్ షా

Spread the loveబీజేపీ ఆలిండియా ప్రెసిడెంట్ అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన కామెంట్స్ ఆయన మెడకు చుట్టుకున్నాయి. తీవ్రRead More

samrat-reddy

టాలీవుడ్ హీరో అరెస్ట్

Spread the loveటాలీవుడ్ లో మరో యువ హీరో చిక్కుల్లో పడ్డారు. అనుష్క సరసన హీరోగాపంచాక్షరి సినిమా హీరో, నటుడుRead More

 • ఆమె కోరడంతో నోరు విప్పబోతున్న పవన్
 • ధోనీకి షాకిచ్చిన కశ్మీరీలు
 • విదేశీ మహిళలతో వెబ్ సైట్లు
 • నందుల కొలమానం ఏమిటి?
 • కాజల్ అప్పుడలా…ఇప్పుడిలా..!
 • బాబు చెప్పింది చేయమంటే పోలీసులతో తన్నించారు..
 • సినీనటితో స్వామీజీ రాసలీలలు
 • బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *