Main Menu

సినీనటితో స్వామీజీ రాసలీలలు

Spread the love

కర్ణాటకలో షాకింగ్‌ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. మరో స్వామీజీ రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. యలహంకలోని మద్దేవనపురలోని తన మఠంలోనే నంజీశ్వర్‌ స్వామీజీ ఓ మహిళతో అభ్యంతరకరమైన స్థితిలో ఉన్న వీడియో కలకలం సృష్టించింది. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. మఠంలోని ఓ గదిలో స్వామీజీతో ఉన్న మహిళ ఓ సినీనటి అని తెలుస్తోంది. అయితే, ఆ నటికి సంబంధించిన పూర్తి వివరాలేమీ ఇంకా తెలియలేదు. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి కుమారుడైన నంజీశ్వర్‌ ప్రస్తుతం మఠం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నంజీశ్వర్‌ స్వామీజీ అలియాస్‌ దయానంద్‌ 2011లోనే ఈ మఠానికి అధిపతి కావాలన్న ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత ఆయన తన పేరును దయానంద్‌గా మార్చుకున్నారు. మఠానికి కేటాయించిన భూముల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయనకేమీ కొత్తకాదని, గతంలో ఎంతోమంది మహిళలతో ఆయనకు ఇలాంటి సంబంధాలే ఉన్నాయంటూ ఆరోపించారు.






Related News

రెండో పెళ్లి చేసుకోవ‌చ్చు..!

Spread the loveరెండో పెళ్లి విష‌యంలో సుప్రీంకోర్ట్ ఆస‌క్తిక‌ర తీర్పు వెలువ‌రించింది. రెండో పెళ్లి చేసుకోవ‌డంపై అభ్యంత‌రాల‌ను తోసిపుచ్చింది. అందుకుRead More

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *