ఎఫ్ బీ, గూగుల్ కి హైకోర్ట్ నోటీసులు

whatsapp fb
Spread the love

చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న ‘బ్లూ వేల్‌ ఛాలెంజ్‌’పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. బ్లూవేల్‌ లింకులకు సంబంధించి ఆయా సంస్థలకు తక్షణ ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది గుర్మీత్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ కూడిన ధర్మాసనం దీనిపై కేంద్రానికి, అటు ఢిల్లీ పోలీసులకు సైతం ఏయే చర్యలు చేపట్టారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది.

చిన్నారుల ప్రాణాలను తీస్తున్న ‘బ్లూవేల్‌ ఛాలెంజ్‌’ గేమ్‌కు సంబంధించిన లింకులు తొలగించాలని ఆయా సంస్థలకు ఇటీవల కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏవేం చర్యలు తీసుకున్నారో తెలుపుతూ నివేదిక సమర్పించాలని ఆయా సంస్థలకు హైకోర్టు సూచించింది. ఈ నెల 28లోగా తమ స్పందన తెలపాలని పేర్కొంది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది.






Related News

poonam

ఆమె కోరడంతో నోరు విప్పబోతున్న పవన్

Spread the loveజనసేనాని స్పందిస్తున్నారు. కత్తి మహేష్ డిమాండ్ చేసినట్టుగా ఆయన నోరు విప్పే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు సమయంRead More

dhoni

ధోనీకి షాకిచ్చిన కశ్మీరీలు

Spread the loveటీమిండియా స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ కశ్మీర్ లో పర్యటించాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీRead More

  • విదేశీ మహిళలతో వెబ్ సైట్లు
  • నందుల కొలమానం ఏమిటి?
  • కాజల్ అప్పుడలా…ఇప్పుడిలా..!
  • బాబు చెప్పింది చేయమంటే పోలీసులతో తన్నించారు..
  • సినీనటితో స్వామీజీ రాసలీలలు
  • బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత
  • భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు
  • సిబ్బందికి ‘టాటా’
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *