Main Menu

ష‌ర్మిళ కేసు అప్ డేట్స్: ఐదుగురికి నోటీసులు

Spread the love

వైఎస్ ష‌ర్మిళ వ్య‌క్తిగ‌త జీవితంపై దుష్ప్ర‌చారం సాగించిన కేసులో విచార‌ణ వేగవంతం అవుతోంది. ఇప్ప‌టికే 12 వెబ్ సైట్ల‌ను అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఐపీ అడ్ర‌స్ లు, యూఆర్ఎల్ స‌హాయంతో ప్ర‌చారం సాగించిన ధోర‌ణి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే కేసు న‌మోదు కాగానే కొంద‌రు స‌ద‌రు పోస్టులు తొల‌గించిన‌ట్టు గుర్తించారు. అయిన‌ప్ప‌టికీ అస‌లు దోషులు ప‌ట్టుబ‌డ‌డం ఖాయ‌మ‌నే విశ్వాసం సైబ‌ర్ క్రైమ్ పోలీసుల నుంచి వినిపిస్తోంది.

ఇక ఈ కేసులో ఐదుగురికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. యూట్యూబ్‌లో దాదాపు 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్‌ చానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు.ఆయా చానల్స్‌లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. మొత్తం 15 మందిని గుర్తించారు. వీరిలో ఐదుగురిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం వీరిని నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారే.

ఐదుగురూ సొంతంగా యూట్యూబ్‌ చానల్స్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో మరికొందరిని విచారించాలని నిర్ణయించారు. అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ, యూ–ట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసే వారి వివరాలు తెలియాల్సి ఉంది. వారు యూ–ట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏ ఐపీ (ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌) అడ్రస్‌ ఆధారంగా ఇంటర్‌నెట్‌ను యాక్సిస్‌ చేశారో గుర్తించాలి. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్‌ యాజమాన్యానికి లేఖ రాశారు. ఆయా చానల్స్‌లో ఉన్న 60 వీడియోలకు దిగువన అనేక మంది అభ్యం తరకరంగా కామెంట్స్‌ చేశారు. వీడియో పోస్ట్‌ చేసిన వారితోపాటు ఈ కామెంట్స్‌ చేసిన వ్యక్తులు కూడా నిందితులుగా మారుతారని చెప్తున్నారు.

యూట్యూబ్‌లోని ఆ వీడియోల కింద వీరు క్రియేట్‌ చేసుకున్న పేరు మినహా మిగిలిన వివరాలు ఉండవు. ఇవన్నీ యూట్యూబ్‌ నిర్వాహకులకే తెలుస్తాయి. కామెంట్‌ చేసిన వారి ఐడీలను గుర్తిస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారి లాగిన్, ఐపీ వివరాలు ఇవ్వాల్సిందిగా యూట్యూబ్‌కు లేఖలు రాస్తున్నారు. ఇలా సాంకేతిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు నిందితుల్ని గుర్తించడానికి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు.






Related News

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the loveమాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నRead More

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *