ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?

ntr
Spread the love

వాస్త‌వానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కి సంబంధించి ప్ర‌స్తుతానికి ఎటువంటి ప్ర‌చారం లేదు. 2009 ఎన్నిక‌ల త‌ర్వాత ఒక‌టి రెండు మ‌హానాడు వేదిక‌ల మీద ద‌ర్శ‌న‌మిచ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్ర‌స్తుతం పూర్తిగా సినిమాల మీద కేంద్రీక‌రించారు. వ‌రుస హిట్స్ తో ఊపుమీదున్నారు. అయితే ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కి సంబంధించి ఓ సినీ న‌టి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఇప్ప‌టికే టాలీవుడ్ లో లోక‌ల్ కి అవ‌కాశాలు ద‌క్క‌డం లేదంటూ కామెంట్స్ తో మాధ‌వీల‌త క‌ల‌క‌లం రేపింది. అందుకు కొన‌సాగింపుగానే అన్న‌ట్టుగా ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ పై కామెంట్స్ చేయ‌డం విశేషం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తని, మంచి మాటకారి అని పేర్కొన్న మాధవి అతడిని ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో యువత అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒకసారి మాట్లాడడం మొదలుపెడితే ఇక ఆపడని, ధారాళంగా మాట్లాడుతూనే ఉంటాడని మాధవి కితాబిచ్చారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ కనిపిస్తాడని భావించానని, కానీ ఏమైందో ఏమోనని ఆవేదన వ్యక్తం చేశారు. జనాలకి మంచి చేయాలన్న ఆలోచన అతడికి తాతగారి నుంచి వచ్చి ఉంటుందని మాధవి పేర్కొన్నారు.

దాంతో మాధ‌వీల‌త వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. అటు టీడీపీ వ‌ర్గాల్లోనూ, ఇటు సినీ వ‌ర్గాల్లోనూ సంచ‌ల‌నంగా మారింది.


Related News

cpim

సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?

Spread the loveసీపీఎం అఖిల‌భార‌త మ‌హాస‌భ‌ల ప్రారంభ‌వేళ అంద‌రి దృష్టి మార్క్సిస్టు పార్టీ మీద ప‌డింది. ముఖ్యంగా సీపీఎం నాయ‌క‌త్వంRead More

sri-reddy-mallidi-hq-photos-in-jeans2

మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

Spread the loveటాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు.Read More

 • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
 • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
 • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
 • ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?
 • గండం నుంచి గ‌ట్టెక్కిన రోజా
 • మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్
 • ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం
 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *