Main Menu

మిసెస్ రామ్ చ‌ర‌ణ్ పోటీపై క్లారిటీ

Spread the love

మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రామ్‌ చరణ్‌ అప్‌డేట్స్‌నే కాకుండా తన వృత్తికి, అపోలో హాస్పిటల్స్‌ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ పత్రికలో వచ్చిన వార్త రాజకీయంగా హ‌ల్ చ‌ల్ చేసింది. దాంతో దాని మీద ఉపాస‌న క్లారిటీ ఇచ్చేశారు. పేప‌ర్ క్లిప్పింగ్ ను కూడా జ‌త చేయ‌డం విశేషం.

చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిపై తాను టీఆర్‌ఎస్‌ తరుపున పోటీచేస్తున్నట్లుగా వచ్చిన వార్తను ఉపాసన ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని.. తాను ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను ప్రేమిస్తున్నానని సంగీతా రెడ్డి(కొండ విశ్వేశ్వర రెడ్డి భార్య) తన బాస్‌ అంటూ చెప్పుకొచ్చారు. చిన్నాన్న(విశ్వేశ్వర రెడ్డి) చేవెళ్లలో మంచి పనులు చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

ఇటీవలె దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో ఉపాసన పాల్గొన్న సంగతి తెలిసిందే. రాజ‌కీయంగా ఆమె ఆస‌క్తిగా ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగిన త‌రుణంలో ఉపాస‌న స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం విశేషంగా మారింది.






Related News

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the loveమాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నRead More

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *