లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం

244011-crimes
Spread the love

లలితా జ్యువెల్లర్స్‌లో మరోసారి దొంగతనం జరిగింది. సోమాజిగూడలోని తమ షోరూమ్‌లో చోరీ జరిగినట్టు లలితా జ్యువెల్లర్స్‌ ప్రతినిధి జి. మధుసూదన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న తమ షోరూమ్‌కు ఓ జంట 66 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసిందని ఫిర్యాదులో తెలిపారు. తమ సిబ్బందిని గందరగోళానికి గురిచేసి ఈ దొంగతనం చేశారని వెల్లడించారు. రూ. 24.9 గ్రాముల బంగా గాజులు, 10.7 గ్రాముల బ్రాస్‌లెట్‌, 30.4 గ్రాముల గాజుల జత ఎత్తుకుపోయారని వివరించారు. తర్వాత రోజు ఈ విషయం బయటపడటంతో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించామన్నారు. చోరీకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అంతకుముందు కూడా లలితా జ్యువెల్లర్స్‌లో దొంగతనం జరిగింది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు రూ. 6 లక్షలు విలువైన బంగారు హారం దొగిలించారని ఈ నెల 9న లలితా జ్యువెల్లర్స్‌ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు నగ స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు ఈ చోరీ చేసినట్టు సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా గుర్తించారు.






Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

  • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
  • కేటీఆర్ కి మరో ఘనత
  • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
  • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
  • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
  • కత్తి మహేష్ కొత్త కేసు
  • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
  • బిత్తిరిసత్తి మీద దాడి
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *