థాయ్ మసాజ్ గుట్టు ఎలా రట్టైందంటే…!

massage
Spread the love

హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరు మసాజ్ సెంటర్లపై పోలీసులు కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసాజ్ పేరుతో శృంగారకార్యకలాపాల్లో మునిగి ఉన్న పలువురిని అదుపులోకి తీసుకోగా, వారిలో 31 మంది విదేశాలకు చెందిన యువతులు ఉండడం విశేషం. ఇంతకీ ఈ ముఠా గుట్టు పోలీసులకు ఎలా చిక్కింది? గుట్టుచప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ల రూపంలో ఉన్న వీటిపై దాడులకు కారణం కూకట్‌ పల్లికి చెందిన 24 ఏళ్ల యువకుడు కావడం విశేషం. యువకుడేదో సంఘ సంస్కరణకు నడుం బిగించాడని భావించకండి.

సదరు యువకుడు ఇటీవల ఇంట్లోంచి 5 లక్షల రూపాయలు దొంగిలించాడు. అయితే కుమారుడే దొంగతనం చేశాడని భావించి కుటుంబ సభ్యులు మందలించి ఊరుకున్నారు. అయితే ఆ యువకుడు ఈ మధ్య 2 లక్షల రూపాయలు మళ్లీ దొంగతనం చేసేందుకు ప్రయత్నించి కుటుంబ సభ్యులకు దొరికిపోయాడు. ఇంతలో హైదరాబాదును డ్రగ్స్ దందా కుదిపేసింది.

 దీంతో ఇంత పెద్దమొత్తంలో డబ్బులు దేనికి అవసరమవుతున్నాయంటూ అతనిని నిలదీశారు. దీంతో మసాజ్ కు వెళ్తున్నానని తెలిపాడు. ఈ మేరకు వివరాలందించినా సంతృప్తి చెందిని కుటుంబ సభ్యులు, అతనిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆరాతీసిన పోలీసులకు థాయ్ మసాజ్ మాటున సాగే గుట్టుచప్పుడు కాని యవ్వారం బయటపడింది. దీంతో దాడులు చేసిన పోలీసులు వారి ఆటకట్టించారు. 


Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

 • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
 • కేటీఆర్ కి మరో ఘనత
 • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
 • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
 • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
 • కత్తి మహేష్ కొత్త కేసు
 • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
 • బిత్తిరిసత్తి మీద దాడి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *