Main Menu

‘కూట‌మి’ ముందు షి’కారు’ సాగ‌లేదు..!?

Spread the love

తెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత తొలి ఎన్నిక‌లు అర‌కొర ఘ‌ట‌న‌లు మిన‌హా దాదాపుగా ప్ర‌శాంతంగా ముగిసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే టీవీ చ‌ర్చ‌ల్లో రాజేసిన వేడి కూడా క్షేత్ర‌స్థాయిలో లేకుండా సాధార‌ణంగా ముగిసింది. పోలింగ్ శాతం మీద కొంద‌రు పెద‌వి విరుస్తున్న‌ప్ప‌టికీ ఫ‌లితాలు మాత్ర‌మే మిగిలి ఉండ‌డంతో ఎవ‌రి భ‌విత‌వ్యం ఎలా ఉంద‌నే దానిపై ఉత్కంఠ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆస‌క్తిగా మారాయి.

మొత్తంగా చూస్తే మ‌హాకూట‌మికి కొంత మొగ్గు ఉంద‌న్న‌ది మెజార్టీ అబిప్రాయంగా ఉంది. ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధ‌మ‌వుతూ సెప్టెంబ‌ర్ లో అసెంబ్లీని ర‌ద్దు చేసిన నాడు కేసీఆర్ లో ఉన్న ధీమా మొత్తం కోల్పోయిన‌ట్టుగా పోలింగ్ బూత్ ల వ‌ద్ద ప‌రిస్థితి క‌నిపించింది. టీడీపీ, కాంగ్రెస్ ల తో పాటు టీజేఎస్, సీపీఐ కూట‌మి కార‌ణంగా చివ‌రి నిమిషంలో సంద‌డి చేశారు. పంపిణీల విష‌యంలో పాల‌క‌ప‌క్షం క‌న్నా ప్ర‌తిప‌క్ష కూట‌మే ఎక్కువ‌గా సాగించ‌డం ఈసారి తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌త్యేక‌త‌గా చెప్ప‌వ‌చ్చు.

ఇక వివిధ ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారో చూద్దాం..

టీవీ9 టీఆర్ఎస్ 90 కూట‌మి 17 బీజేపీ 07 ఎంఐఎం 05 ఇత‌రులు
ల‌గ‌డ‌పాటి టీఆర్ఎస్ 35(10అటూఇటూ) కూట‌మి 65(10అటూఇటూ) బీజేపీ 07 ఎంఐఎం 07 ఇత‌రులు 7
టైమ్స్ నౌ టీఆర్ఎస్ 66 కూట‌మి 37 ఇత‌రులు 9 బీజేపీ 07
గోనె ప్ర‌కాశ‌రావు టీఆర్ఎస్ 45 వ‌ర‌కూ కూట‌మి 60కి పైగా
రిప‌బ్లిక్ టీవీ టీఆర్ఎస్ 50-65 మ‌హాకూట‌మి 38-52
ఆరా ఏజ‌న్సీ టీఆర్ఎస్ 75-85 కాంగ్రెస్ 25-35 బీజేపీ 1-3 ఎంఐఎం 07-08






Related News

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the loveమాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నRead More

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *