Main Menu

నంద‌మూరి హీరోకి షాక్

Spread the love

నంద‌మూరి హీరోకి షాక్ త‌గిలింది. జీహెచ్ఎంసీ షాక్ తో ఆయ‌న వ్యాపారానికి ఆటంకం క‌లిగింది. దాంతో ఈ వ్య‌వ‌హారం హైద‌రాబాద్ లో క‌ల‌క‌లం రేగింది. నందమూరి తారకరత్నకు ఇదో గట్టి షాక్ గా క‌నిపిస్తోంది. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.12లో తారక రత్న నడుపుతున్న కబరా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో హీరో తారక రత్న హుటాహుటిన అక్కడికికి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారన్న కారణంతోనే అధికారులు ఈ చర్యలు చేపట్టారని తెలుస్తోంది. రాత్రి వేళల్లో మద్యం అమ్మకాలు, సౌండ్స్‌తో న్యూసెన్స్‌ చేస్తున్నారని సొసైటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.






Related News

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the loveమాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నRead More

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *