స‌మంత‌- కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర…

ktr samantha
Spread the love

అక్కినేని వారి కాబోయే కోడలు ఏమి చేసినా ఆస‌క్తిదాయ‌క‌మే. తాజాగా తెలంగాణా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె ట్వీటు ఆస‌క్తిగా మారింది. చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. కేటీఆర్ స్పంద‌న‌తో మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పై స‌మంత పొగ‌డ్త‌ల వ‌ర్షం వెనుక కార‌ణాల‌పై ప‌లువురు ఆస‌క్తిగా మాట్లాడుకోవ‌డం విశేషం.

కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్వీట్ చేసిన స‌మంత . ‘‘అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్’’ అని ట్వీట్ చేసింది.

సమంత ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.. ‘‘మా చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ ఫోకస్, డెడికేషన్‌తో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. వొవెన్2017(చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో) కోసం ఎదురు చూస్తున్నా.’’ అని రిప్లయ్ ఇచ్చారు. అందుకు సమంత ప్రతిస్పందిస్తూ ‘ధన్యవాదాలు సర్’ అని ముగించింది.

తెలంగాణ చేనేత వస్త్రాలకు సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. సమంత చేనేత వస్త్రాలు ధరించి ఇటీవల ఓ మ్యాగజైన్‌ కోసం చేసిన ఫొటోషూట్ సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం విధితమే. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా ఇప్పుడు ఏకంగా బ‌ర్త్ డే విషెస్ పేరుతో ఒక‌రినొక‌రు ప్ర‌శంసించుకోవ‌డం విశేష‌మే.






Related News

vishnu-manchu_640x480_51441176836

బీజేపీ నాయకుడిపై మంచు విష్ణు ఆగ్రహం

Spread the loveమంచు వారబ్బాయి ఫైరయ్యారు. కేంద్రంలో అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్న నాయకుడిపై మండిపడ్డారు. తీవ్రంగా వ్యాఖ్యానించారు. తీరుRead More

ktr

కేటీఆర్ ని వేడుకున్న ఆమ్రాపాలీ!

Spread the loveరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఏం చేసినా హాట్‌ టాపిక్ అవుతోంది. సిన్సియర్‌గా పనిచేస్తారని, అభివృద్ధి పనులను పరుగులుRead More

  • హీరో రాజశేఖర్ కారు ప్రమాదం ..
  • సెలబ్రిటీలపై ఫేక్ పోస్టులు పెడుతున్నాడని అరెస్ట్
  • మోత్కుపల్లి ఆశలు వదులకున్నట్టే..!
  • అధికార పార్టీ ఎంపీ రాజీనామాకి ముహూర్తం
  • హీరో ఇంట్లో దాడి
  • కార్టూనిస్ట్ మోహన్ ఇకలేరు..
  • తల్లి అవుతున్న హీరోయిన్
  • తెలంగాణా మహిళలకు చిర్రెత్తింది
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *