గండం నుంచి గ‌ట్టెక్కిన రోజా

roja
Spread the love

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. విమాన ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. షంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన ప్ర‌మాదంలో విమానం టైర్ పేల‌డంతో క‌ల‌క‌లం రేగింది. అంత‌కుముందు పొగ వ్యాపించ‌డంతో ప్ర‌యాణీకులంతా ఉక్కిరిబిక్కిర‌య్యారు. తిరుప‌తి నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన విమానంలో ఆమె పయాణం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ర‌న్ వే పైకి రాగానే ఒక్క‌సారిగా పెను శ‌బ్ధం రావ‌డంతో అల‌జ‌డి మొద‌ల‌య్యింది. సుమార అర‌గంట పాటు తీవ్రంగా క‌ల‌త చెందామ‌ని రోజా తెలిపారు. ఎయిర్ హోస్టెస్ సూచ‌న‌తో తాము లోప‌లే ఉండిపోయామ‌ని తెలిపారు.

చాలా భ‌య‌ప‌డ్డామ‌ని, కానీ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఒక్క‌సారిగా మంట‌లు కూడా వ్యాపించ‌డంతో విమానం పేలిపోతుంద‌ని ఊహించామ‌ని, కానీ అలా తాము ఊపిరిపీల్చుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని ఆమె పేర్కొన్నారు. గ‌తంలో కూడా ప‌లుమార్లు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఇలాంటి విమాన ప్ర‌మాదాల‌కు గుర‌య్యారు. ఆయ‌న కూడా భారీ ప్ర‌మాదాల నుంచి త‌ప్పించుకున్నారు. తాజాగా ఆర్కే రోజా కూడా ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవ‌డం వైసీపీ శ్రేణులకు ఉప‌శ‌మ‌నం క‌లిగించింది.


Related News

cpim

సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?

Spread the loveసీపీఎం అఖిల‌భార‌త మ‌హాస‌భ‌ల ప్రారంభ‌వేళ అంద‌రి దృష్టి మార్క్సిస్టు పార్టీ మీద ప‌డింది. ముఖ్యంగా సీపీఎం నాయ‌క‌త్వంRead More

sri-reddy-mallidi-hq-photos-in-jeans2

మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

Spread the loveటాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు.Read More

 • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
 • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
 • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
 • ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?
 • గండం నుంచి గ‌ట్టెక్కిన రోజా
 • మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్
 • ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం
 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *