మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ

ramgopal varma rgv
Spread the love

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట మార్చేశారు. తన సొంత సినిమాగా చెప్పుకున్న జీఎస్టీపై ఆయన కొత్త పాట పాడారు. జీఎస్టీ(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) సినిమాను తాను తీయలేదని చెప్పుకొచ్చారు. ఆ సినిమాకు డైరెక్టర్‌ తాను కాదని పేర్కొన్నారు. తనపై సీసీఎస్‌లో నమోదైన రెండు కేసులపై వివరణ ఇచ్చేందుకు వర్మ విచారణకు హాజరయ్యారు. సామాజిక కార్యకర్త దేవీ ఇచ్చిన ఫిర్యాదుతో వర్మ విచారణ జరిగింది

.. విజీఎస్టీ సినిమా షూటింగ్‌లో తాను పాల్గొనలేదని ఈ సందర్భంగా వర్మ చెప్పారు. కేవలం కాన్సెప్ట్ మాత్రమే తనదని వర్మ అన్నారు. అమెరికన్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా తీసిందని, తాను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని, తనకు డబ్బులు ముట్టినట్లు ఆధారాలుంటే రుజువు చేయాలని వర్మ సవాల్ చేశారు. భారతీయ చట్టాలను తాను ఉల్లంఘించలేదని చెప్పిన వర్మ.. సామాజిక కార్యకర్త దేవిని కావాలని తాను దూషించలేదని, మాటా మాటా పెరిగి వివాదంగా మారిందని చెప్పుకొచ్చారు.

జీఎస్‌టీ వెబ్‌సిరీస్‌ వ్యవహారం, మహిళలను కించపరిచారనే అభియోగం కింద నమోదైన రెండు కేసుల విషయంలో వర్మను సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నించారు. మూడున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో సైబర్‌ క్రైం అదనపు డీసీపీ రఘువీర్‌ ఆధ్వర్యంలోని బృందం వర్మకు కీలక ప్రశ్నలు సంధించింది. ఐటీ చట్టం, ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద నమోదైన రెండు కేసుల విషయంలో వర్మపై సీసీఎస్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. సామాజిక కార్యకర్త దేవిపై చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మ నుంచి వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.


Related News

T-New-MD-is-now-TRS-General-Secretary-1507625306-1411

మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్

Spread the loveరాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. తెలంగాణా రాష్ట్ర స‌మితిRead More

supreme court

ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓటుకి నోటు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. కీల‌క ప‌రిణామంRead More

 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ
 • సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ
 • పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు
 • వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్
 • ఎమ్మెల్యే రోజాకి షాక్
 • డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్
 • ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *