ప్రియ‌మ‌ణి ముహూర్తం ఫిక్స్..!

priyamani-story-+-fb_647_052916013603
Spread the love

టాలీవుడ్ స‌హా ప‌లు దక్షిణాది సినిమాల్లో న‌టించి, ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు సాధించిన ప్రియమణి పెళ్లికూతుర‌వుతోంది. సంప్ర‌దాయ‌ వాసుదేవ అయ్యర్ కుటుంబానికి చెందిన ప్రియ‌మ‌ణి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారయింది. ముంబైకి చెందిన ముస్తఫారాజ్‌తో ఈనెల 23న ఏడడుగులు నడిచేందుకు ఆమె సిద్ధమయ్యారు. రెగ్యుల‌ర్ పెళ్ళితంతుకి భిన్నంగా ఎలాంటి హంగామా లేకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

దాంతో ఈ పెళ్లి కార్య‌క్ర‌మానికి కుటుంబ సభ్యులు, ఆప్తులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. 24న గురువారం బెంగళూరులోని ఓ హోటల్‌లో రిసెప్షన్ నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. గత ఏడాది నిశ్చితార్థం కూడా బెంగళూరు నివాసంలో కుటుంబీకుల సమక్షంలో జరిగింది. అదే రీతిన ఆర్భాటం లేకుండా వివాహం చేసుకుంటున్నారు. కన్నడం, మళయాళం, తమిళం, తెలుగు భాషలను అనర్గళంగా మాట్లాడగల్గిన ప్రియమణి ఈ భాషలన్నింటిలోనూ నటించారు. మంచి హీరోయిన్ గా గుర్తింపు కూడా సాధించారు.


Related News

T-New-MD-is-now-TRS-General-Secretary-1507625306-1411

మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్

Spread the loveరాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. తెలంగాణా రాష్ట్ర స‌మితిRead More

supreme court

ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓటుకి నోటు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. కీల‌క ప‌రిణామంRead More

 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ
 • సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ
 • పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు
 • వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్
 • ఎమ్మెల్యే రోజాకి షాక్
 • డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్
 • ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *