ప్ర‌గ‌తిశీల శాస్త్ర‌వేత్త పీఎం భార్గ‌వ‌ మృతి

Bhargava_1217967f_2601114f
Spread the love

అభ్యుదయ శాస్త్రవేత్త సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ ( సిసిఎంబి ) వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పిఎం భార్గవ కన్ను మూశారు. ఆయన పూర్తి పేరు పుష్ప మిత్ర భార్గవ. వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో హైదరాబాద్‌, ఉప్పల్‌ ప్రశాంత్‌ నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

భార్గవకు కుమారుడు మోహిత్‌, కుమార్తె వినీత ఉన్నారు. ఆయున సతీమణి మనోరమ గతేడాది మరణించారు. కాగా భార్గవ మరణవార్త తెలుసుకున్న సిసిఎంబి డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా, మాజీ డైరెక్టర్లు మోహన్‌రావు, లాల్‌జీ సింగ్‌, పలువురు శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భార్గవ పార్థివదేహానికి నివాళులర్పించారు. భార్గవ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు.






Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

  • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
  • కేటీఆర్ కి మరో ఘనత
  • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
  • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
  • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
  • కత్తి మహేష్ కొత్త కేసు
  • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
  • బిత్తిరిసత్తి మీద దాడి
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *