Main Menu

కారు క్యాంపులో వేడి పుట్టిస్తున్న ఓవైసీ

Spread the love

టీఆర్ఎస్ మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకోగ‌ల‌న‌నే ధీమాలో ఉంది. దానికి అనేక కార‌ణాలున్నాయి. అన్నింటికీ మించి ఎంఐఎం మ‌ద్ధ‌తు త‌మ‌కేన‌నే ధీమా కూడా కీల‌కం. బొటాబొటీగా సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ చ‌క్కగా గ‌ట్టెక్క‌గ‌ల‌మ‌నే గ‌ట్టి న‌మ్మ‌కం తెలంగాణా రాష్ట్ర స‌మితి శ్రేణుల్లో వినిపిస్తోంది. క‌నీసంగా 50 సీట్లు త‌గ్గ‌కుండా చూసుకుంటే..ఆ త‌ర్వాత ఏడెనిమిది స్థానాలు ఎంఐఎం ద్వారా వ‌స్తాయ‌ని, ఒక‌రిద్ద‌రు ఇండిపెండెంట్ల మ‌ద్ధ‌తు కూడ‌గ‌డితే కుర్చీ నిలబెట్టుకోవ‌డం పెద్ద క‌ష్టం కాద‌నే వాద‌న వినిపిస్తోంది.

అయితే ప‌రిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ఊహించినట్టుగా క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు కారు వైపు కుతూహ‌ల‌ప‌డుతున్న హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఆఖ‌రి నిమిషంలో ఎటు మ‌ళ్లుతారోన‌నే టెన్ష‌న్ క‌నిపిస్తోంది. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. అస‌దుద్దీన్ టీఆర్ఎస్ వైపు చూస్తుంటే, అక్బ‌రుద్దీన్ కాంగ్రెస్ శిబిరంతో ట‌చ్ లో ఉండ‌డ‌మే దానికి కార‌ణం గా చెప్ప‌వ‌చ్చు. సలావుద్దీన్‌ ఒవైసీ బతికున్నప్పుడు తనయులు అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీ చెరోదారిలో ఉండేవారు. తండ్రితో విభేదించి అక్బర్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్బర్‌ దూకుడుగా ఉంటారని, అసద్‌ లౌక్యంగా వ్యవహరిస్తారని పేరు. ఎనిమిదేళ్ల కిందట అక్బర్‌పై హత్యాయత్నం తర్వాత అన్నాదమ్ములు కలిసికట్టుగానే ఉంటున్నారు.

కానీ వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత అన్న‌ద‌మ్ములిద్ద‌రూ చెరో వైపు లాగితే చివ‌ర‌కు ఎంఐఎం మ‌ద్ధ‌తు ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌ది ప్ర‌శ్నార్ధ‌కం కాబోతోంది. హంగ్ అసెంబ్లీ వ‌స్తే అనూహ్య ప‌రిణామాల‌కు అవ‌కాశం క‌నిపిస్తోంది ఇప్ప‌టికే తాము సీఎం పీఠం మీద ఉంటామంటూ అక్బ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఈ క్ర‌మంలోనే చూడాలి. ఈ ప‌రిణామాల‌తో పాతబస్తీలో వేడెక్కుతున్న రాజకీయాలు ఎన్నిక‌ల అనంత‌రం రసవత్తరంగా సాగుతాయని అంటున్నారు. 8వ సీటుపై కన్నేసిన మజ్లిస్‌ అసలు ఉన్న ఏడు సీట్లను కాపాడుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏడు సిట్టింగ్‌ స్థానాల్లో మజ్లిస్‌ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. యాకుత్‌పురా, నాంపల్లిలో ప్రత్యర్థులు మజ్లిస్‌కు చెమటలు పట్టిస్తున్నారు. దాంతో ఆరు నుంచి ఎనిమిది స్థానాలు గ్యారంటీగా ద‌క్కించుకోబోతున్న ఎంఐఎం వ్య‌వ‌హారం ఎటు మ‌ళ్లినా తెలంగాణా రాజ‌కీయాలు చ‌ర్చ‌నీయాంశాల‌వుతాయ‌న‌డంలో సందేహం లేదు.


Related News

ఆస్ట్రేలియా ఎన్నికల్లో తెలంగాణా యువ‌కుడు

Spread the loveతెలుగు వారి కీర్తి ఇప్ప‌టికే అనేక దేశాల అత్యున్న‌త స‌భ‌ల‌కు చేరింది. అమెరికా, యూర‌ప్ దేశాల‌లో అనేకRead More

వైసీపీలోకి చంద్ర‌బాబు, వివాదంలో ఆర్జీవీ

Spread the loveవివాదాస్ప‌ద సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి కూడా టీడీపీ అధినేతRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *