Main Menu

రంగంలోకి యంగ్ టైగ‌ర్ సోద‌రి

Spread the love

ఎన్టీఆర్ కుటుంబం నుంచి మ‌రో నాయ‌కురాలు త‌యార‌వుతున్నారు. టీడీపీ లో పోలిట్ బ్యూరో స‌భ్యుడిగా ప‌నిచేసిన దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ వార‌సురాలు తెర‌మీద‌కు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణా ఎన్నిక‌ల్లో ఆమె పోటీకి ఉత్సుక‌త చూపుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ఆమె పేరు ప్ర‌తిపాద‌న‌కు రావ‌డంతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అక్క‌కు రంగం సిద్ధ‌మ‌యిన‌ట్టేన‌ని అంచ‌నాలేస్తున్నారు.

హ‌రికృష్ణ కుమార్తె సుహాసినికి కూక‌ట్ ప‌ల్లి నుంచి అసెంబ్లీకి అవ‌కాశం క‌ల్పించేందుకు టీడీపీ నేత‌లు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. .. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌ సతీమణి. వాస్త‌వానికి తొలుత క‌ళ్యాణ్ రామ్ ని కూక‌ట్ ప‌ల్లి నుంచి బ‌రిలో దింపాల‌ని టీడీపీ ఆలోచించింది. అయితే ఆయ‌న నిరాక‌రించ‌డంతో సుహాసిని పేరు ప్ర‌తిపాదించిన‌ట్టు చెబుతున్నారు. కూక‌ట్ ప‌ల్లి నుంచి సుహాసిని బ‌రిలో దిగితే రాజ‌కీయంగా కీల‌క ప‌రిణామాలు ఖాయ‌మ‌ని భావిస్తున్నారు.

సెటిల‌ర్లు ఎక్కువ‌గా క‌నిపించే కూక‌ట్ ప‌ల్లి సీటు మీద చాలామంది టీడీపీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. . ఈ స్థానం నుంచి తానే పోటీ చేయబోతున్నట్టు పార్టీ సీనియర్‌ నేత పెద్ది రెడ్డి కొద్దిరోజులుగా స్థానిక కార్యకర్తలకు చెబుతూవచ్చారు. ఈయనకు పోటీగా మందాడి శ్రీనివాసరావు కూడా గట్టి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అందుకు తోడుగా కూకట్‌పల్లి స్థానాన్ని బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా పెరిగింది. ఈ స్థానాన్ని కాపులకు కేటాయించాలని ఏపీకి చెందిన కొంతమంది కాపు నేతలు.. బీసీలకు ఇవ్వాలని పలు బీసీ సంఘాలు కూడా చంద్రబాబును కోరినట్లు సమాచారం. కాపు సామాజికవర్గానికి చెందిన ప్రేమ్‌కుమార్‌, పారిశ్రామిక వేత్త ప్రభాకర్‌రావులు అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ కావ్యారెడ్డి భర్త హరీశ్‌ రెడ్డి మంగళవారం విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకుని, తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

ఇలా ప‌లువురు ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా సుహాసిని పేరు ముందుకు రావ‌డం విశేషంగా మారుతోంది. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అయితే సుహాసిని అభ్య‌ర్థిత్వాన్ని టీడీపీలో కొంద‌రు వ్య‌తిరేకిస్తున్న‌ట్టు స‌మాచారం. దాంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది.


Related News

వైసీపీలోకి చంద్ర‌బాబు, వివాదంలో ఆర్జీవీ

Spread the loveవివాదాస్ప‌ద సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి కూడా టీడీపీ అధినేతRead More

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ త‌ర్వాత వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నం

Spread the loveఆర్జీవీ. సంచ‌ల‌నాల‌కు చిరునామా. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా క‌నిపిస్తుంటారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ తో త‌గాదాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *