మోత్కుపల్లి ఆశలు వదులకున్నట్టే..!

Motkupalli-Narasimhulu
Spread the love

తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీలో అందరికన్నా దురద్రుష్టవంతుడు ఎవరంటే ఠక్కున సమాధానం చెప్పే పేరు మోత్కుపల్లి నర్సింహులనే చెప్పవచ్చు. దళిత సామాజికవర్గానికి చెందిన మోత్కుపల్లికి ఆశ పెట్టి ఆయన పార్టీ అదినేత అంతలోనే ఆశలు నీరుగార్చేయడం అలవాటుగా మార్చుకున్నారు. కేంద్రంలో తీగ కదులుతుందంటే అది మోత్కుపల్లి కోసమే అన్నట్టుగా చిత్రీకరించిన తెలుగు మీడియా పెద్దలు కూడా అందుకు భాగస్వాములు. బాబు తాన అంటే తందాన అన్నట్టుగా వంత పాడిన వారందరికీ మోత్కుపల్లికి జరిగిన అన్యాయంలో వాటా ఉంటుంది.

వాస్తవానికి అదిగో గవర్నర్ గిరీ అంటూ చేసిన ప్రచారానికి నాలుగేళ్లు నిండిపోతున్న నేపథ్యంలో ఇక ఆ ఆలోచనకు నూరేళ్లూ నిండినట్టేనని మోత్కుపల్లి భావిస్తున్నారు. తాను రాజ్యసభ సభ్యత్వం అడిగితే తనకు గవర్నర్ గిరీ అంటూ ఆశ పెట్టింది చంద్రబాబేనని మోత్కుపల్లి ఇప్పుడు వాపోతున్నారు. తనకు ఇస్తానని చెప్పిన రాజ్యసభ సభ్యత్వాన్ని అప్పట్లో చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన గరికపాటి మోహన్ రావుకి ఇచ్చి తనకు మాత్రం గవర్నర్ పదవి వస్తుందని చెప్పారని వెల్లడించారు. కానీ తీరా చూస్తే కేంద్రంలో ఎవరూ బాబుకే అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న సమయంలో మోత్కుపల్లికి గవర్నర్ గిరీ వస్తుందనే ఆశలు పూర్తిగా అడుగంటి పోవడంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

కానీ మోత్కుపల్లి లాంటి నాయకుడి విషయంలో టీడీపీ తీరు మాత్రం వివక్షతకు అద్దంపడుతుంది. గతంలో క్యాబినెట్ విస్తరణ సమయంలో సుజనా చౌదరి ని తొలగించాలని ప్రయత్నించినప్పుడు టీడీపీ నాయకత్వం గట్టిగా అడ్డు తగిలింది. కోర్టులో వివాదాలు, ఇతర ఆర్థిక అక్రమాల వ్యవహారాలు ఉన్నప్పటికీ ఆయన సీటుని కాపాడగలిగింది. అదే సమయంలో మోత్కుపల్లికి మాట ఇచ్చి నిలబెట్టుకోవడంలో మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలే లేవు. తెలుగుమీడియాలో కథనాలు తప్ప అసలు ఆ పేరుని పరిశీలిస్తున్నారన్న సమాచారమే లేదు. దాంతో చివరకు మొండిచేయి మిగలడంతో మెత్కుపల్లి నిరాశలో మునిగిపోక తప్పలేదు.


Related News

MM Keeravani_3030

కీర‌వాణికి నోటీసులు జారీ

Spread the loveజీఎస్టీ సినిమా ఎంత సంచ‌ల‌నం అయ్యిందో…ఇప్పుడు అదే స్థాయిలో స‌మ‌స్య‌లు కొనితెచ్చిపెట్టింది. దాంతో దర్శకుడు రాంగోపాల్ వర్మRead More

ramgopal varma rgv

మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ

Spread the loveవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట మార్చేశారు. తన సొంత సినిమాగా చెప్పుకున్న జీఎస్టీపై ఆయనRead More

 • సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ
 • పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు
 • వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్
 • ఎమ్మెల్యే రోజాకి షాక్
 • డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్
 • ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య
 • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
 • కేటీఆర్ కి మరో ఘనత
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *