మండపాలపై మంచు లక్ష్మి ఫిర్యాదు

Manchu-Lakshmis-Upcoming-Movie-Lakshmi-Bomb-Officially-launched
Spread the love

తెలంగాణా ప్రభుత్వానికి మంచు లక్ష్మీ లేఖాస్త్రం సంధించారు. హైదరాబాద్‌ నగరంలో గణేష్‌ మండపాల కోసం రోడ్లను ఇష్టానుసారంగా తవ్వుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని మంచు లక్ష్మి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. వినాయక చవితి సందర్భంగా నగరానికి జరుగుతున్న నష్టం గురించి ప్రస్తావించారు. వినాయక మండపాలను నిర్మించడానికి రోడ్లను తవ్వుతున్నారని, ఫిల్మ్‌ నగర్‌ రోడ్డు నంబరు1లో రోడ్లను తవ్వుతున్నారన్నారు. భారీ గణపతి విగ్రహాలను తరలించడానికి అడ్డంగా ఉన్న కేబుల్‌ వైర్లను కూడా కట్‌ చేశారని, వీటిని తిరిగి బాగు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారో ఓ సిటిజన్‌గా తాను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.

వినాయక చవితి పండగను మతపరంగా భావించకుండా ఓ పోటీగా భావిస్తున్నారన్నారు. వేడుకను ఇతరుల కన్నా వైభవంగా జరపాలని, వ్యయ ప్రయాసలకు వెనకాడటం లేదన్నారు. ఓ ప్రాంతానికి ఒకే మండపం ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. దీని వల్ల ఒకే ప్రాంతంలోని వ్యక్తుల్లో ఐక్యత పెరగడమే కాకుండా కలిసి పండగను జరుపుకొనే సంప్రదాయాన్ని కాపాడాలనే ఆలోచన వస్తుందన్నారు. ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ట్విట్టర్‌ ద్వారా ఈ సమస్యను తెలుపుతున్నానని కెటిఆర్‌కు వివరించారు.






Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

  • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
  • కేటీఆర్ కి మరో ఘనత
  • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
  • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
  • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
  • కత్తి మహేష్ కొత్త కేసు
  • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
  • బిత్తిరిసత్తి మీద దాడి
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *