Main Menu

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the love

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆశించారు. ఆ విష‌యాన్ని బ‌హిరంగంగానే చెప్పారు. కానీ ప‌రిస్థితి సానుకూలంగా లేద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన ఆయ‌న వెన‌క్కి త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణా నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న ఆశించారు. ముఖ్యంగా మ‌ల్కాజ్ గిరి నుంచి గానీ మ‌రో సీటు గానీ ఆయ‌న ఆశించిన‌ట్టు ప్ర‌చారం సాగింది. కానీ ఇటీవల రాజ‌కీయంగా చురుగ్గా క‌నిపిస్తున్న ఆయ‌న పోటీ నుంచి విర‌మించుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా, ఈ ఊహాగానాలకు లగడపాటి తెరదించారు. తానే పార్టీలోనూ చేరబోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. తన పోటీపై వస్తున్నవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెగేసి చెప్పారు. ఈ సందర్బంగా వచ్చే ఎన్నికల్లో పోటీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు






Related News

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the loveమాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నRead More

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *