Main Menu

ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న నిర్ణ‌యం

Spread the love

ఆంధ్రా ఆక్టోప‌స్ గా పిలుచుకునే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపుతున్నారు. గ‌తంలో రెండు మార్లు ఆయ‌న బెజ‌వాడ నుంచి పార్ల‌మెంట్ కి ప్రాతినిధ్యం వ‌హించారు. 2004,09 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున విజ‌య‌వాడ నుంచి గెలిచి స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో ర‌క‌ర‌కాల విన్యాసాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. అయితే ఆ త‌ర్వాత రాష్ట్ర‌విభ‌జ‌న‌తో రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించి మొన్న‌టి ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌లేదు. కానీ ఎన్నిక‌ల స‌ర్వేల‌తో ఆయ‌న సంచ‌లనాల‌కు కేంద్రం అవుతూనే ఉన్నారు. ఆయ‌న పేరుతో వివిధ స‌ర్వేలు నిత్యం హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

అయితే ల‌గ‌డపాటి తాజా నిర్ణ‌యం పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి పోటీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఈవిష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. అయితే పోటీ చేసేందుకు త‌న‌కు ఆహ్వానాలు అందుతున్నాయ‌ని చెబుతున్న ఆయ‌న దృష్టి తెలంగాణా మీద ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. మెద‌క్ నుంచి పోటీ చేయాల‌ని త‌న‌ను కోరుతున్నార‌ని ల‌గ‌డ‌పాటి చెప్ప‌డం విశేషంగా మారింది. ఆయ‌న మ‌న‌సు అటు మ‌ళ్లింద‌న‌డానికి సంకేతంగా క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సెమీస్ ఫ‌లితాల ప‌ట్ల ఆయ‌న సొంత స‌ర్వేని డిసెంబ‌ర్ 7 త‌ర్వాత ప్ర‌క‌టిస్తాన‌ని వెల్ల‌డించారు. అంతేగాకుండా జ‌గ‌న్ పై దాడిని ఖండిస్తూ హ‌త్యా రాజ‌కీయాలు శ్రేయ‌స్క‌రం కాద‌ని తెలిపారు.






Related News

టీఆర్ఎస్ లోకి మ‌రో ఎమ్మెల్యే

Spread the loveరామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.Read More

‘కూట‌మి’ ముందు షి’కారు’ సాగ‌లేదు..!?

Spread the loveతెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత తొలి ఎన్నిక‌లు అర‌కొర ఘ‌ట‌న‌లు మిన‌హా దాదాపుగా ప్ర‌శాంతంగా ముగిసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *