Main Menu

గ‌జ్వేల్ లో కేసీఆర్ కూడా పోతారు..!

Spread the love

గజ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో స్వ‌యంగా తెలంగాణా సీఎం కేసీఆర్ ఓడిపోతార‌ని త‌న‌కు కొంద‌రు కానిస్టేబుల్స్ చెప్పిన‌ట్టు ల‌గ‌డ‌పాటి వివ‌రించారు. ఇటీవ‌ల సిద్ధిపేట‌, గజ్వేల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాన‌ని అక్టోబ‌ర్ 28 నాడు త‌న‌తో కానిస్టేబుల్స్ చెప్పిన మాట ప్ర‌కారం కేసీఆర్ పోతార‌ని పేర్కొన్నారు. తెలంగాణాలో తాను నిర్వ‌హించిన స‌ర్వే వివ‌రాల‌ను కేటీఆర్ కి వివ‌రించిన‌ట్టు అంగీక‌రించారు. త‌మ మ‌ధ్య జ‌రిగిన చాట్ వివ‌రాల‌ను మీడియాకు అందించారు. కేటీఆర్ రిలీజ్ చేసిన ఛాట్ వాస్త‌వ‌మేన‌ని, ఆ త‌ర్వాత ప‌రిణామాలు మారుతున్నాయ‌ని వివ‌రించారు. తాజాగా వ‌రంగల్ లో కూడా కాంగ్రెస్ బాగా పుంజుకుంద‌ని తెలిపారు.

ఎస్సీ వ‌ర్గాల్లో 3 ఎక‌రాల భూమి, ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వంటివి ప్ర‌భావం చూపుతున్నాయ‌న్నారు ఎస్టీల‌లో 12 శాతం రిజ‌ర్వేష‌న్ల కారణంగా కేసీఆర్ మీద వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌న్నారు. ఇక మైనార్టీల‌లో కూడా మార్పు వ‌స్తోంద‌ని టీఆర్ఎస్ కి గ‌డ్డు స్థితి ఏర్ప‌డుతోంద‌ని జోస్యం చెప్పారు. త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యం కాద‌ని, చిత్త‌శుద్ధికి సంబంధించిన అంశం కాబ‌ట్టే మాట్లాడుతున్నాన‌న్నారు. ఎవ‌రి ఒత్తిడికి త‌లొగ్గే మ‌నిషిని తాను కాద‌న్నారు. చంద్ర‌బాబుతో స్నేహం కొన‌సాగించాల‌ని తాను కేటీఆర్ కి సూచింన‌ట్టు ల‌గ‌డ‌పాటి వెల్ల‌డించారు. భావోద్వేగాల‌తో ఇప్పుడు ఓట్లు పండే అవ‌కాశం లేద‌న్నారు.స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో హ‌రీష్ కామెంట్స్ వ‌ల్లే తాను రాజ‌కీయాల‌కు త‌ప్పుకుంటాన‌ని చెప్పి దానిని అమ‌లు చేశాన‌ని వెల్ల‌డించారు


Related News

వైసీపీలోకి చంద్ర‌బాబు, వివాదంలో ఆర్జీవీ

Spread the loveవివాదాస్ప‌ద సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి కూడా టీడీపీ అధినేతRead More

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ త‌ర్వాత వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నం

Spread the loveఆర్జీవీ. సంచ‌ల‌నాల‌కు చిరునామా. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా క‌నిపిస్తుంటారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ తో త‌గాదాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *