Main Menu

నంద‌మూరి వార‌మ్మాయి నిల‌దొక్కుకునేనా?

Spread the love

తెలంగాణా ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ కుటుంబం రంగ‌ప్ర‌వేశం చేయ‌డం ఆస‌క్తిగా మారింది. సెటిల‌ర్ల అడ్డా కూక‌ట్ ప‌ల్లిలో నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేస్తుండ‌డంతో అంద‌రి దృష్టి అటు మ‌ళ్లింది. హ‌రికృష్ణ వార‌సులిద్ద‌రుండ‌గా, వార‌సురాలిని ముందుకు తీసుకురావ‌డంలో చంద్ర‌బాబు వ్యూహం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. భ‌విష్య‌త్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ముందుకు రాకుండా చేసేందుకు సుహాసిని ని పావుగా వాడుకునే ఆలోచ‌న ఉంద‌ని కొంద‌రు చెబుతుంటే, ఒక‌వేళ జూనియ‌ర్ ఎన్టీఆర్ ముందుకొచ్చిన‌ప్ప‌టికీ వారికి తెలంగాణా వ‌ర‌కే ప‌రిమితం చేయాల‌నే ఆలోచ‌న‌లో టీడీపీ అధినేత ఉన్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

కార‌ణాలేమ‌యినా అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌చ్చిన చుండ్రు సుహాసిని ఇప్పుడు మ‌ళ్లీ అవ‌స‌రార్థం నంద‌మూరి సుహాసినిగా ఓట‌ర్ల‌కు ప‌రిచయం అవుతున్నారు. రాజ‌కీయంగా ఎటువంటి అనుభ‌వం లేక‌పోయిన‌ప్ప‌టికీ స‌రిగ్గా 20 రోజుల గ‌డువు మాత్ర‌మే ఉన్న ఎన్నిక‌ల స‌మ‌రాంగ‌ణంలోకి ఆమె అడుగుపెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావుని ఆమె ఢీ కొంటారు. మాధ‌వ‌రం కూడా సెటిల‌ర్ ఫ్యామిలీ, మొన్న‌టి వ‌ర‌కూ ఫిరాయింపు ఎమ్మెల్యే కూడా కావ‌డం విశేషం.

కూక‌ట్ ప‌ల్లిలో టీడీపీకి కొంత ప‌ట్టుంది. సామాజికంగా, ప్రాంతీయంగా స‌మీక‌ర‌ణాలు అందుకు ప్ర‌ధాన కార‌ణం. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్య‌తిరేక‌త కూడా ఉంది. మ‌హాకూట‌మి బ‌లం టీడీపీకి తోడ‌వుతుంది. దాంతో అనుకూల ప‌రిస్థితుల మ‌ధ్య రంగంలోకి వ‌స్తున్న సుహాసినికి ఆఖ‌రికి ఎలాంటి ఫ‌లితాలు ద‌క్కుతాయ‌న్న‌ది వేచి చూడాల్సిందే. సోద‌రులు ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. క‌ళ్యాణ్ రామ్ ముందుకొచ్చిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ మాత్రం ట్వీట్ తో స‌రిపెట్టుకునే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిణామాల‌తో కూక‌ట్ ప‌ల్లి ఫ‌లితం ఆస‌క్తిదాయ‌క‌మే.






Related News

టీఆర్ఎస్ లోకి మ‌రో ఎమ్మెల్యే

Spread the loveరామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.Read More

‘కూట‌మి’ ముందు షి’కారు’ సాగ‌లేదు..!?

Spread the loveతెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత తొలి ఎన్నిక‌లు అర‌కొర ఘ‌ట‌న‌లు మిన‌హా దాదాపుగా ప్ర‌శాంతంగా ముగిసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *