లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌

ktr
Spread the love

బిజినెస్‌ వరల్డ్‌ ఐదో స్మార్ట్‌ సిటీస్‌ కాంక్లేవ్‌ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలో ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ‘లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు. పట్టణాభివృద్ధికి మౌలికవసతులు కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు లభించిన మరో అవార్డును పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ”పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. మూడున్నరేళ్ల క్రితం తెలంగాణలో విద్యుత్‌ లోటు ఉండేది. పారశ్రామికరంగం, వ్యవసాయం, గృహావసరాలకు తీవ్ర విద్యుత్‌ కొరత ఉండేంది. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో విద్యుత్‌ సమస్యను అధిగమించాం. 2018 జనవరి 1 నాటికి సాగుకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వగలిగే స్థాయికి ఎదిగాం. పారిశ్రామిక రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. సోలార్‌ ద్వారా 3వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించబోతున్నాం. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది” అని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

 • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
 • కేటీఆర్ కి మరో ఘనత
 • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
 • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
 • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
 • కత్తి మహేష్ కొత్త కేసు
 • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
 • బిత్తిరిసత్తి మీద దాడి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *