Main Menu

కీర‌వాణికి నోటీసులు జారీ

MM Keeravani_3030
Spread the love

జీఎస్టీ సినిమా ఎంత సంచ‌ల‌నం అయ్యిందో…ఇప్పుడు అదే స్థాయిలో స‌మ‌స్య‌లు కొనితెచ్చిపెట్టింది. దాంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్ప‌టికే స‌త‌మ‌తం అవుతున్నారు. నోటిదురుసుతో వ‌ర్మ అవ‌స్థ‌లు ఆఖ‌రికి ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో చ‌ల్లారుతాయ‌ని భావించినా, అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు వ‌ర్మ‌తో పాటు కీర‌వాణీ కూడా ఆ జాబితాలో చేరారు. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) లఘుచిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించ‌డ‌మే ఆయ‌న స‌మ‌స్య కు కార‌ణం అయ్యింది. సామాజిక కార్య‌క‌ర్త దేవీ ఫిర్యాదుతో విచార‌ణ ప్రారంబించిన సీసీఎస్ పోలీసులు తాజాగా కీర‌వాణికి కూడా నోటీసులు పంపించారు.

జీఎస్టీ నిర్మాణంలో సహకరించిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో ఒక్కర్ని కూడా తప్పించకుండా అందర్నీ విచారించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వర్మ నేరం చేశాడని పక్కా సాక్ష్యాలు సేకరించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే వ‌ర్మ‌కు సంబంధించిన ల్యాప్ టాప్ సీజ్ అధికారులకు ఫోరెన్సిక్ ద్వారా కీల‌క ఆధారాలు సంపాదించార‌నే వాద‌న వినిపిస్తోంది. దాంతో ఆయ‌న జైలు పాలుకావ‌డం ఖాయంగా మారింది. ఈ నేప‌థ్యంలో కీర‌వాణికి ఏమేర‌కు స‌మ‌స్య అవుతుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే






Related News

nani wife sri reddy

నాని భార్య‌కు శ్రీరెడ్డి వార్నింగ్

Spread the loveటాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ రాజుకుంటుంది. కొద్దిరోజులు చ‌ల్లారిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ, హీరో నాని పంపిన లీగల్Read More

Bigg-Boss-Telugu-2nd-Season-Participants-1528568767-18

బిగ్ బాస్ 2 లిస్ట్ ఇదే..!

Spread the loveబిగ్ బాస్ 2 ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ త‌ర్వాత నాని హోస్ట్ గా వ‌స్తున్న ఈ షోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *