డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ కి ఊర‌ట క‌ల్పించిన కేసీఆర్

KCR1
Spread the love

డ్ర‌గ్స్ కేసుతో త‌ల్ల‌డిల్లుతున్న టాలీవుడ్ కి ఊర‌ట ల‌భించింది. విచార‌ణ ముగింపుకొస్తున్న స‌మ‌యంలో స్పందించిన తెలంగాణా ముఖ్య‌మంత్రి సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు. డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ ఎదుర్కొన్న వారంద‌రినీ దాదాపుగా బాధితులుగా గుర్తించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు అంతా భావిస్తున్నారు. కేవ‌లం డ్ర‌గ్స్ అమ్మ‌కాలు సాగిస్తే త‌ప్ప సేవించే వారిపై చ‌ర్య‌లు ఉండ‌వ‌ని, వారికి కేవ‌లం కౌన్సిలింగ్ మాత్ర‌మే ఉంటుంద‌ని చెప్ప‌డం ద్వారా కేసీఆర్ ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది.

అంతేగాకుండా మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందిస్తామని కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణను పారదర్శకంగా, చిత్తశుద్దితోనూ నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు కేసీఆర్ సూచించారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, అకున్ సబర్వాల్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు వివరాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. కేసును పారదర్శకంగా, చిత్తశుద్ధితో నిర్వహించి సామాజిక రుగ్మతలను సంపూర్ణంగా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. డ్రగ్స్ సరఫరా, పేకాట క్లబ్బులు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదన్నారు. ఇంకా చెప్పాలంటే దాని ప్రవేశమే లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గుడుంబా, పేకాటలాగే డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టదని కేసీఆర్ వివరించారు.


Related News

T-New-MD-is-now-TRS-General-Secretary-1507625306-1411

మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్

Spread the loveరాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. తెలంగాణా రాష్ట్ర స‌మితిRead More

supreme court

ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓటుకి నోటు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. కీల‌క ప‌రిణామంRead More

 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • మాట మార్చేసిన రామ్ గోపాల్ వర్మ
 • సంగీత దర్శకుడి ఇంట్లో చోరీ
 • పవన్ కళ్యాణ్ పై చెప్పు విసిరిన అగంతకుడు
 • వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సస్ఫెన్షన్
 • ఎమ్మెల్యే రోజాకి షాక్
 • డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్
 • ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *