Main Menu

జ‌య‌రామ్ కేసులో కొత్త మ‌లుపులు

Spread the love

ఎన్నారై చిగుర‌పాటి జ‌య‌రామ్ కేసు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. హైద‌రాబాద్ టూ నందిగామ , మ‌ళ్లీ అక్క‌డి నుంచి హైద‌రాబాద్ కి ఈ కేసు చేరింది. తాజాగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి 93/2019 నెంబర్‌తో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ప్రస్తుతానికి నందిగామ పోలీసులు నమోదు చేసిన తొమ్మిది సెక్షన్లను కొనసాగిస్తామని, భవిష్యత్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరికొన్ని చేరుస్తామని తెలిపారు. జయరామ్‌ గతనెల 31న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లోని రాకేష్‌ నివాసంలో హత్యకు గురికాగా, ఆయన మృతదేహం కృష్ణా జిల్లా నందిగామ లో మరుసటిరోజు కనిపించింది. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన నందిగామ పోలీసులు రాకేష్‌తోపాటు వాచ్‌మెన్‌ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు. పెనుగులాట, పిడిగుద్దుల వల్లే జయరామ్‌ మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో జయరామ్‌ భార్య పద్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయింది.

అనంతరం దర్యాప్తు ప్రారంభించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. ఈ హత్యలో ఐదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించుకోవడానికి ప్రస్తుతం ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని నిర్ణయించారు. శుక్రవారం నాంపల్లి న్యాయస్థానం నుంచి పీటీ వారెంట్‌ కూడా తీసుకున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఓ ప్రత్యేక బృందం ఏపీ వెళ్లి అక్కడి కోర్టు అనుమతితో జైల్లో ఉన్న నిందితులను ఇక్కడకు తీసుకురానుంది.






Related News

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the loveమాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నRead More

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *