Main Menu

హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక

Spread the love

ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చారు. వెళ్లారు. కానీ చర్చ మాత్రం చల్లారడం లేదు. ముఖ్యంగా ఇవాంక తీరుపై ఇప్పుడు విమర్శలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్ లో ఆమె చేసిన ప్రసంగం చివరకు అధ్యక్షుడి కుమార్తెను అభాసుపాలుజేస్తున్నట్టు కనిపిస్తోంది. జీఈఎస్ లో ఆమె మాటల మీద ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియా లో చర్చ సాగుతోంది అమెరికాలో పలువురు ఆమె తీరును తప్పుబడుతున్నారు.

ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు లో పాల్గొన్న ఇవాంకా ట్రంప్ ప్రసంగంపై అమెరికాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత నెల 2న టోక్యోలో జరిగిన వరల్డ్ అసెంబ్లీ ఫర్ విమెన్ (వావ్)లో చేసిన ప్రసంగాన్నే కాస్తా అటు ఇటుగా మార్చి హైదరాబాద్‌లో ఇవాంకా చదివేశారని ‘న్యూస్‌వీక్’ పత్రిక పేర్కొంది. ఆమె ప్రసంగంలోని కొన్ని చిన్నచిన్న పదాలు తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్ అని పేర్కొంది. ‘ఈ ముత్యాల నగరిలో గొప్ప నిధి మీరే’ లాంటి చిన్నచిన్న పదాలు మాత్రమే కొత్తగా వాడారని, ‘మహిళలు పనిచేస్తే దాని ప్రభావం ద్విగిణీకృతం అవుతుంది. పురుషుల కంటే మహిళలే మహిళలకు ఎక్కువ ఉపాధి ఇవ్వగలుగుతారు’ అన్న వాక్యాలను పూర్తిగా టోక్యో ప్రసంగం నుంచి యథాతథంగా తీసుకున్నారని కథనంలో పేర్కొంది. మహిళలు వారి సంపాదనను తిరిగి సమాజంలోనే పెట్టుబడిగా పెడతారన్నవాక్యాలు కూడా అక్కడివేనని వివరించింది. ఇవాంకా ట్రంప్‌ రీసైకిల్స్‌ హెర్‌ ఓన్‌ స్పీచ్‌ ఇన్‌ ఇండియాా శీర్షికతో న్యూస్ వీక్ ప్రచురించిన కథనంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






Related News

టీఆర్ఎస్ లోకి మ‌రో ఎమ్మెల్యే

Spread the loveరామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.Read More

‘కూట‌మి’ ముందు షి’కారు’ సాగ‌లేదు..!?

Spread the loveతెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత తొలి ఎన్నిక‌లు అర‌కొర ఘ‌ట‌న‌లు మిన‌హా దాదాపుగా ప్ర‌శాంతంగా ముగిసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *