హీరో రాజశేఖర్ కారు ప్రమాదం ..

rajasekhar
Spread the love

సినీ నటుడు రాజశేఖర్‌ కారు అర్ధ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ముందువెళ్తున్న రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్‌ కారును రాజశేఖర్‌ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం సేవించి కారునడిపాడని రామిరెడ్డి రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో తీవ్రకలకలం రేపింది. మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత కథ మారిపోయింది. తల్లి చనిపోయిన డిప్రెషన్‌లో రాజశేఖర్‌ కారు నడపడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, బ్రీత్‌ అన్‌లైజర్‌ పరీక్షల్లో మద్యం సేవించలేదని తేలిందని ఎస్‌ఐ శేఖర్‌ రెడ్డి ప్రకటించారు. చివరకు రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు రాజీకుదర్చడంతో రామిరెడ్డి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు.


Related News

ktr

కేటీఆర్ ని వేడుకున్న ఆమ్రాపాలీ!

Spread the loveరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఏం చేసినా హాట్‌ టాపిక్ అవుతోంది. సిన్సియర్‌గా పనిచేస్తారని, అభివృద్ధి పనులను పరుగులుRead More

rajasekhar

హీరో రాజశేఖర్ కారు ప్రమాదం ..

Spread the loveసినీ నటుడు రాజశేఖర్‌ కారు అర్ధ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపైRead More

 • సెలబ్రిటీలపై ఫేక్ పోస్టులు పెడుతున్నాడని అరెస్ట్
 • మోత్కుపల్లి ఆశలు వదులకున్నట్టే..!
 • అధికార పార్టీ ఎంపీ రాజీనామాకి ముహూర్తం
 • హీరో ఇంట్లో దాడి
 • కార్టూనిస్ట్ మోహన్ ఇకలేరు..
 • తల్లి అవుతున్న హీరోయిన్
 • తెలంగాణా మహిళలకు చిర్రెత్తింది
 • సాటి డాక్ట‌రే…!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *