Main Menu

ముద్దుల‌పై హెబ్బా సీరియస్, వాకౌట్

Spread the love

ముద్దుల వ్య‌వ‌హారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. 24 కిసెస్ మువీ ఇప్పుడు దుమారం రేపుతోంది. వివాదానికి కార‌ణంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో హెబ్బా ప‌టేల్ ఆగ్ర‌హంతో వాకౌట్ చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతోంది. టాలీవుడ్ లో తెరకెక్కిన కొత్త చిత్రం ’24 కిస్సెస్’లో చాలా సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. దాంతో ఈ అంశంపై తెలుగు న్యూస్ చానెల్ ఒక‌టి చర్చ కు సిద్ధ‌మయ్యింది. ఆ వార్తా చానల్ ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించగా, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సినిమాలో సీన్లు వల్గర్ గా ఉన్నాయని అంటున్నట్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను యూనిట్ తిప్పికొట్టింది.

ఆపై చర్చ పక్కదారి పట్టగా, తాము నాలుగు గోడల మధ్య జరిగే సీన్లను, నాలుగు గోడల మధ్య జరిగినట్టుగానే చూపామని యూనిట్ వివరణ ఇచ్చింది. ఇదే విషయమై హెబ్బా పటేల్ స్పందిస్తూ, ఈ చిత్రంలో కేవలం ముద్దు సీన్లను మాత్రమే హైలైట్ చేస్తున్నారని, సినిమాలో ఇంకా చాలా ఉందని చెబుతూ తాను ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రకటించి, వెళ్లిపోయింది. సినిమాలో కిస్ సీన్ ను వల్గర్ అనడం ‘పర్వర్షన్’ అని హీరో అదిత్ అరుణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెబ్బా ప‌టేల్ సీరియ‌స్ గా మ‌ధ్య‌లో వ‌చ్చ‌య‌డం విశేషంగా మారుతోంది.






Related News

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

జ‌య‌రామ్ కేసులో కొత్త మ‌లుపులు

Spread the loveఎన్నారై చిగుర‌పాటి జ‌య‌రామ్ కేసు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. హైద‌రాబాద్ టూ నందిగామ , మ‌ళ్లీ అక్క‌డిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *