అధికార పార్టీ ఎంపీ రాజీనామాకి ముహూర్తం

GUTHA SUKHENDER REDDY
Spread the love

నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. నల్లగొండ పార్లమెంటు స్థానానికి గుత్తా రాజీనామా చేస్తారని ఆయనకు సిఎం కెసిఆర్ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని కేబినెట్ హోదాతో కట్టబెడతారన్న ప్రచారంతో గుత్తా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు. కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరినా గుత్తా చట్టపరమైన ఇబ్బందులతో ఇప్పటిదాకా అధికారికంగా టిఆర్‌ఎస్ కండువా కప్పుకోకపోయినప్పటికీ నల్లగొండ జిల్లాలో మంత్రి జి.జగదీష్‌రెడ్డికి సమానంగా ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ అభివృద్ధి పనులను, పార్టీ రాజకీయాలను ముందుకు దూకిస్తున్నారు. టిఆర్‌ఎస్‌లో అనధికారికంగా ఎంపి గుత్తా చేరిన సందర్భంలో ప్రధానంగా ఆయన మంత్రి పదవిపై ఆశలతో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు కెసిఆర్ అయిష్టత ప్రకటించిన నేపథ్యంలో ఎంపి గుత్తాకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని కేబినెట్ హోదా తో కట్టబెట్టాలని కెసిఆర్ నిర్ణయించినట్టు భోగట్టా. ఇందు కు దసరా తర్వాతా ముహూర్తం నిర్ణయించుకున్నారని తెలిసింది.

అయతే, గుత్తాకు చైర్మన్ పదవి ఇచ్చాకే ఆయనతో ఎంపి పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని కెసిఆర్ భావనగా గులాబీ వర్గాల్లో ప్రచారం జరు గుతోంది. కెసిఆర్ పావులు కదుపుతూ గతంలో కర్షక పరిషత్ తరహాలో లేక మరో రూపంలో కోర్టులో నిలబడేలా రాష్ట్ర రైతు సమన్వయ సమితిని చట్టబద్ధంగా ఏర్పా టు చేసి, అందుకు ఆక్టోబర్‌లో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడం, లేదా ముం దుగానే ఆర్డీనెన్స్ జారీ చేసి అసెంబ్లీలో ఆమోదం తీసుకోవడం చేయవచ్చంటూ ఊహాగానాలు సాగుతున్నాయి.


Related News

pradeep

డ్రంక్ ఇన్ డ్రైవ్ లో స్టార్ యాంకర్

Spread the loveనూతన సంవత్సరం తొలిరోజే హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. న్యూ ఇయర్ జోస్‌లో మునిగితేలిన యువకులకు భాగ్యనగర పోలీసులుRead More

A palm

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

Spread the loveఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామRead More

 • లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న కేటీఆర్‌
 • కేటీఆర్ కి మరో ఘనత
 • రిజర్వేషన్ల ఘర్షణలో ఐదుగురి హతం
 • లలిత జ్యూయెలర్స్ లో మళ్లీ దొంగతనం
 • చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి ఏం చేసిందో తెలుసా
 • కత్తి మహేష్ కొత్త కేసు
 • హైదరాబాద్ ట్రిప్పులో అభాసుపాలయిన ఇవాంక
 • బిత్తిరిసత్తి మీద దాడి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *