Main Menu

నందమూరి బాలయ్య చుట్టూ వివాదం

Spread the love

ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రుష్ణ వివాదంలో ఇరుక్కున్నారు. తెలంగాణా పర్యటనలో ఆయన తీరు మీద ఆగ్రహం వ్యక్తమయ్యింది. బాలకృష్ణ తమను కాలితో తన్నారని అభిమానులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి మిట్టపల్లి బాలయ్య పర్యటించారు. ఈ సందర్భంగా అభిమానులు బాలకృష్ణ కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. వ్యాన్‌పై నుంచి దిగి షేక్‌ లాలు, రమేష్, కృష్ణయ్యలను కాలితో తన్నారు. అనంతరం కల్లూరు వెళ్లారు. బాలయ్య వైఖరిపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగులబెట్టారు.

బాలకృష్ణ క్షమాపణ చెప్పేవరకు ఆందోళన చేస్తామని అభిమానులు భీష్మించుకొని కూర్చున్నారు. తాము అభిమానంతో వస్తే తన్నడం ఏమిటని ప్రశ్నించారు.అభిమానంతో చూద్దామని వస్తే నాపై బాలయ్య చేయి చేసుకున్నాడు. వ్యాన్‌పై నుంచి కిందకు దిగి వచ్చి ఆగ్రహంతో మెడ పై చేత్తో కొట్టాడు. మరికొంత మందిని కాలితో తన్నాడు. మా అభిమానానికి బహుమానంగా బాలయ్య దురుసుగా ప్రవర్తించడం బాధగా ఉంది.






Related News

టీఆర్ఎస్ లోకి మ‌రో ఎమ్మెల్యే

Spread the loveరామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.Read More

‘కూట‌మి’ ముందు షి’కారు’ సాగ‌లేదు..!?

Spread the loveతెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత తొలి ఎన్నిక‌లు అర‌కొర ఘ‌ట‌న‌లు మిన‌హా దాదాపుగా ప్ర‌శాంతంగా ముగిసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *