Main Menu

ఆ చానెల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటున్న టీకాంగ్రెస్

Spread the love

రాజ‌కీయ ప‌క్షాల‌కు వంత‌పాడ‌డం, అధికార పార్టీల‌కు అండ‌గా నిల‌వ‌డం మీడియాలో మెజార్టీ సెక్ష‌న్ కి అలవాటుగా మారింద‌నే అభిప్రాయం బ‌లంగా ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే వ‌ర్త‌మాన మీడియా వైఖ‌రి సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా మోడీయాగా కొంద‌రు అభివ‌ర్ణిస్తున్న జాతీయ మీడియాలో కొన్ని చానెళ్ల ధోర‌ణి శృతిమించిపోతోంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. తాజాగా టైమ్స్ నౌ చానెల్ తీరు దానికి అనుగుణంగా క‌నిపిస్తోంది.

తెలంగాణా కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప‌ట్ల టైమ్స్ నౌ ప్ర‌సారాల‌ను విప‌క్ష నేత‌లు సీరియ‌స్ గా తీసుకున్నారు. త‌క్ష‌ణం క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మ‌తాల ప్రాతిప‌దిక‌న ఓట్లు సంపాదించాల‌ని చూస్తున్న ఆర్ఎస్ఎస్ శ‌క్తుల‌కు అనుగుణంగా టైమ్స్ నౌ క‌థ‌నాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ముస్లీంల‌కు వ‌రాలు కురిపిస్తూ, కాంగ్రెస్ వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేసిందంటూ టైమ్స్ నౌ క‌థ‌నం రాయ‌డాన్ని కాంగ్రెస్ త‌ప్పుబ‌డుతోంది.

త‌మ మ్యానిఫెస్టోలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంద‌రికీ క‌లిగించే ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌స్తావించామ‌ని, అయిన‌ప్ప‌టికీ కేవ‌లం కాంగ్రెస్ ముస్లీంల ఓట్ల కోసం ప్ర‌య‌త్నిస్తుంద‌నే అర్థం వ‌చ్చే రీతిలో వార్త‌లు రాయ‌డం త‌గ‌ద‌ని చెబుతోంది. ఏక‌ప‌క్ష క‌థ‌నాల‌తో కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా సాగుతున్న ప్ర‌య‌త్నాలు ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటార‌ని, టైమ్స్ నౌ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తోంది.






Related News

టీఆర్ఎస్ లోకి మ‌రో ఎమ్మెల్యే

Spread the loveరామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.Read More

‘కూట‌మి’ ముందు షి’కారు’ సాగ‌లేదు..!?

Spread the loveతెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత తొలి ఎన్నిక‌లు అర‌కొర ఘ‌ట‌న‌లు మిన‌హా దాదాపుగా ప్ర‌శాంతంగా ముగిసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *