Main Menu

కేటీఆర్ ఓ ప‌నికిమాలిన వెధ‌వ‌!

ktr-council
Spread the love

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ ఓ పనికిమాలిన వెధవ అని, కాంగ్రెస్‌ పార్టీపై తన స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ఉత్తమ్‌ దేశభక్తుడైతే.. కేటీఆర్‌ గుంటనక్క అని, అమెరికా నుంచి గుంటనక్కలా వచ్చి.. నేడు తోడేలులా మారాడన్నారు. ఉత్తమ్‌ కాలిగోటికి కూడా సరిపోడని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌పై, ఉత్తమ్‌పై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇసుక మాఫియా పేరిట రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవం కాదా? అందులో టీఆర్‌ఎస్‌ నేతలకు వాటాల్లేవా? అని ప్రశ్నించారు. దీనిని నిరూపించేందుకు తాను సిద్ధమని, కేటీఆర్‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఇసుక రీచ్‌ కాంట్రాక్టర్లు కేటీఆర్‌ కుటుంబ సభ్యులు, బంధువులేనని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. గోల్డ్‌ మైన్స్‌ మినరల్‌ కంపెనీలో కేసీఆర్‌ బంధువు సంతోష్‌ కుమార్‌కు వాటాలున్నాయని శ్రవణ్‌ ఆరోపించారు. ఇన్నోవా కొనుగోళ్లతో తనకు సంబంధం లేదంటూ కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెప్పారని, 2007లో హిమాన్షు మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పెట్టిన కేటీఆర్‌.. ఆ విషయాన్ని 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు ప్రస్తావించారని నిలదీశారు.






Related News

kambampati rammohan

టీడీపీ కీల‌క‌నేత‌పై కేసు న‌మోదు

Spread the loveకాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల్లో కార్ల సర్వీస్‌ సెంటర్‌Read More

kathi-mahesh_2

క‌త్తి మ‌హేష్ క‌థ‌లో కొత్త క్యారెక్ట‌ర్

Spread the love1Shareక‌త్తి మ‌హేష్ క‌థ కొత్త మ‌లుపు తిరిగింది. ప‌రిపూర్ణానంద‌, క‌త్తి మ‌హేష్ వ్య‌వ‌హారంలో మ‌రో క్యారెక్ట‌ర్ ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *