ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన

bjp dharna
Spread the love

ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన సాగింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారీకేడ్లు ఏర్పాట్లు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి వివిధ పీఎస్ లకు తరలించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో గడిచిన కొన్ని రోజులుగా మోడీ పై వస్తున్న కథనాలతో బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. వాటిని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ వారిని పోలీసులు నిలువరించారు.

మోడీ మానసిక స్థితిగతులపై ఆంధ్రజ్యోతి విశ్లేషణాత్మక కథనాలు ఇస్తోంది చాలాకాలంగా సోషల్ మీడియాలో సాగుతున్న విషయాలను వివరించి ప్రచురిస్తోంది. టీడీపీ, బీజేపీ మధ్య బంధం పూర్తిగా తెగిపోయిన తర్వాత వస్తున్న ఈ కథనాలతో బీజేపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. మోడీ మీద ఆంధ్రజ్యోతి రాతలను సహించలేకపోతోంది. దాంతో ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ఆందోళన సాగించింది. సి నరసింహరావు పేరుతో వస్తున్న విశ్లేషణలో వాస్తవం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రజ్యోతి కథనాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Related News

cpim

సీపీఎంకి మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా?

Spread the loveసీపీఎం అఖిల‌భార‌త మ‌హాస‌భ‌ల ప్రారంభ‌వేళ అంద‌రి దృష్టి మార్క్సిస్టు పార్టీ మీద ప‌డింది. ముఖ్యంగా సీపీఎం నాయ‌క‌త్వంRead More

sri-reddy-mallidi-hq-photos-in-jeans2

మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

Spread the loveటాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు.Read More

 • ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…
 • శ్రీరెడ్డి న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌
 • ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఆందోళన
 • ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?
 • గండం నుంచి గ‌ట్టెక్కిన రోజా
 • మీడియా ప్ర‌ముఖుడికి రాజ్య‌స‌భ టికెట్
 • ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం
 • కీర‌వాణికి నోటీసులు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *