Main Menu

బాబు గోగినేని అవుట్..!

Spread the love

బిగ్‌బాస్‌ హౌజ్‌లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్‌లోంచి బయటకు వచ్చేశాడు. కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో బాబుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు కౌశల్‌ ఆర్మీ ఉండనే ఉంది. అసలే కౌశల్‌కు బాబు గోగినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో.. కౌశల్‌ ఫాలోవర్స్‌కు బాబుపై వ్యతిరేకత చూపించారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు వెళ్లాలి? అని డిసైడ్‌ చేసే కౌశల్‌ ఆర్మీ ఈ సారి బాబును బయటకు పంపేసింది.

హౌజ్‌లో అందరితో కలిసి ఉన్నట్లు కనిపించే బాబు.. కౌశల్‌ విషయం వచ్చేసరికి మాత్రం అమాంతం ఎగిరిపడేవారు. కౌశల్‌తో ఢీ అంటే ఢీ అనేవారు. ఇక ఈ వారం జరిగిన షోలో మళ్లీ వీరిద్దరి మధ్య చిచ్చు రగిలింది. అమ్మాయిలకు రావాల్సిన డబ్బును దొంగలించాడని కౌశల్‌ను దొంగ అంటూ నిందించారు. గత వారాలన్నింటిలో కౌశల్‌ను టార్గెట్‌ చేసిన బాబు గోగినేని .. ఒకానొక దశలో కౌశల్‌ అయినా ఉండాలి నేనైనా ఉండాలి అంటూ ఆవేశపూరితంగా చెప్పుకొచ్చాడు. ఒక వేళ తాను వెళితే .. కౌశల్‌ను బయటకు పంపడానికి ప్రయత్నిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ విషయంలో బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాని మందలిస్తూ.. ఎవరు ఎవరిని బయటకు పంపలేరని, అది ప్రేక్షకుల చేతిలో ఉందంటూ.. బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారమే బాబు హౌజ్‌ నుంచి బయటకు వెళతారని పలువురు భావించారు. అయితే గతవారం నందిని రాయ్‌ బయటకు వెళ్లడంతో బాబు గోగినేని ఎలిమినేట్‌ కావడానికి వారం మాత్రమే ఆలస్యమైంది.






Related News

ప‌వ‌న్ పోటీ చేయ‌డం లేదు..

Spread the loveరాబోతున్న ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వైఖ‌రిని ప్ర‌క‌టించేశారు. అంద‌రిలో ఆస‌క్తి రేపిన ఈ వ్య‌వ‌హారంలో త‌నRead More

నందమూరి బాలయ్య చుట్టూ వివాదం

Spread the loveఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రుష్ణ వివాదంలో ఇరుక్కున్నారు. తెలంగాణా పర్యటనలో ఆయన తీరు మీద ఆగ్రహం వ్యక్తమయ్యింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *