Main Menu

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the love

జ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడా చేరారు. జ‌బ‌ర్ధ‌స్త్ లో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న న‌రేష్ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేగింది.

జబర్దస్త్ ఫేమ్‌ నరేష్ నృత్య బృందంపై శ్రీకాకుళం జిల్లా, చిన్నబరాటం ప్రాంతానికి చెందిన కొందరు స్థానిక యువకులు దాడి చేయడంతో కేసు నమోదైంది. అంతకుముందు ఈ ప్రాంతంలో కళింగాంధ్ర ఉత్సవాల సందర్భంగా ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చేందుకు రాగా, వారు గ్రీన్ రూములో ఉన్న వేళ వివాదం చెలరేగింది. కొందరు యువకులు గ్రీన్ రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, నటీనటులు, యాంకర్లకు రక్షణగా ఉన్న బౌన్సర్లు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.

కార్యక్రమం సజావుగానే సాగినా, తిరుగు ప్రయాణం వేళ, మార్గమధ్యలో కొందరు స్థానిక యువకులు వారి వాహనాలను అడ్డగించారు. తమను కొట్టి, దూషించారంటూ, వాహనాలపై దాడికి దిగారు. నరేష్ టీమ్ పై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ లో అప్పగించిన టీమ్, వారిపై ఫిర్యాదు చేశారు. కాగా, జరిగిన ఘటనపై స్పందించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ దాడి చేసిన వారందరినీ అరెస్ట్ చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.






Related News

ల‌గ‌డ‌పాటి అవుట్..

Spread the loveమాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణా విష‌యంలో చేసిన ఛాలెంజ్ తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నRead More

జ‌బర్ధ‌స్త్ న‌రేష్ పై దాడి

Spread the loveజ‌బ‌ర్ధ‌స్త్ క‌ళాకారుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ జాబితాలో చేర‌గా తాజాగా న‌రేష్ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *