వాట్సాప్ లోనూ దాచుకోవచ్చు..!

1469807832WhatsApp-Not-Delete-Conversations
Spread the love

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆప్షన్‌ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్‌లను స్టోర్‌ చేసుకునే అవకాశం లేదు. కేవలం మన పంపించుకునే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లు మాత్రమే ఫోన్‌ మెమొరీలో స్టోర్‌ అవుతున్నాయి. ఇకపై మనం పంపించిన.. మనకు వచ్చిన టెక్ట్స్‌ మెసేజ్‌లను భద్రంగా దాచుకునే సౌలభ్యాన్ని వాట్సాప్‌ ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం గతంలో ఐఓఎస్‌ ఫోన్లలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్‌ వినియోగదారులు సెట్టింగ్స్‌లో డేటా అండ్‌ స్టోరేజ్‌ యూసేజ్ ఆప్షన్‌లోకి వెళ్లి స్టోరేజ్‌ యూసేజ్‌ దగ్గర క్లిక్‌ చేస్తే సమాచారమంతా ఫోన్‌ స్టోరేజ్‌లో సేవ్‌ అవుతుంది. మెసేజ్‌లతో పాటు ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, జిఫ్‌ ఫైళ్లు, అప్లికేషన్స్‌, కాంటాక్ట్‌ కార్డ్స్‌, డాక్యుమెంట్లు.. ఇలా అన్ని రకాల సమాచారాన్ని భద్రంగా దాచుకోవచ్చు. అయితే మనకు అవసరం లేదనుకున్న మెసేజ్‌లను మేనేజ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌ ద్వారా తొలగించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ ఆప్షన్‌ వాట్సాప్‌ v2.17.34 బీటా వెర్షన్‌ వాడే వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


Related News

google-logo-wordmark-2015-1920-800x450

మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..

Spread the loveమొబైల్‌ వినియోగ దారులు తమ డేటా యూసేజ్‌ను ట్రాక్‌ చేసుకొంటూ నియంత్రించేందుకు వీలుగా ఇంటర్‌నెట్‌ దిగ్గజ సంస్థRead More

youtube go

యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్

Spread the loveయూట్యూబ్ వీడియోలను వీక్షించే వారికి గూగుల్ శుభవార్త చెప్పింది. ‘యూట్యూబ్ గో’ పేరుతో లైట్ వెయిట్ వెర్షన్Read More

 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
 • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
 • వాట్సాప్ లో నయా ఫీచర్
 • BSNL చౌక ఫోన్‌ సిద్ధం
 • ఐ ఫోన్ 7వేలకే..
 • ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం
 • స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *