వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి

1469807832WhatsApp-Not-Delete-Conversations
Spread the love

న్యూ ఇయర్ దెబ్బకు వాట్సాప్ ఉక్కిరిబిక్కిరయ్యింది. మెసేజ్ ల వెల్లువతో తల్లడింది. చివరకు కొంత సేపు క్రాష్ కావడంతో అందరినీ నిరుత్సాహపరించింది.మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సప్‌ క్రాష్‌డౌన్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా కొద్దిపాటి కలకలంరేగింది. ఊహకు అందని రీతిలో న్యూఇయర్‌ విషెస్‌ వెల్లువత్తడంతో ఏర్పడిన సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:10 గంటల నుంచి దాదాపు 2 గంటలపాటు వాట్సప్‌ నిలిచిపోయినట్లు ఫిర్యాదులు అందాయి. తొలుత న్యూజిలాండ్‌లో వేడుకలు మొదలు.. వరుసగా ఆస్ట్రేలియా, జపాన్‌, చైనా, హాంకాంగ్‌, భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ అటుపై పశ్చిమదేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఆయా దేశాల్లో శుభాకాంక్షల మెసేజ్‌లు వెల్లువెత్తడంతో మెసేజింగ్‌ యాప్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు చెబుతూ వాట్సప్‌ ప్రతినిధులు ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వాట్సప్‌ యధావిధిగా పనిచేస్తోంది.


Related News

facebook

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఫేస్ బుక్

Spread the loveసోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కేంబ్రిడ్జ్ ఎనాలిటికా విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్ల విష‌యంలోRead More

fb

ప‌డిపోయిన ఫేస్ బుక్ వాల్యూ

Spread the loveఅనూహ్యంగా ఎదిగిన ఫేస్ బుక్ ప్ర‌స్థానంలో పెను ఆటంకం ఏర్ప‌డింది. ఆసంస్థ షేర్లు అమాంతంగా ఢ‌మాల్ అంటున్నాయి.Read More

 • వాట్సాప్‌లో ఇక కుద‌ర‌దు..
 • వాట్సాప్ లో వచ్చేసింది…
 • స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…
 • వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్
 • వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి
 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *