Main Menu

వాట్సాప్ యూజర్లకు గుడ్, బ్యాడ్ న్యూస్

Spread the love

వాట్సాప్ యూజర్లకు తీపి, చేదు వార్తలు ఒకేసారి బయటకు వచ్చాయి. ఆంఢ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయని ప్రకటించింది. గూగుల్‌తో ఇటీవలే వాట్సప్ జత కట్టిన విషయం తెలిసిందే. దాంతో ఇకపై గూగుల్‌ డ్రైవ్‌లోని వాట్సాప్‌ బ్యాకప్‌లు, యూజర్ల క్లౌడ్‌ స్టోరేజ్‌ స్పేస్‌ను తొలగించడం లేదని వాట్పాప్ ప్రకటించింది. గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజ్‌లో యూజర్ల వాట్సాప్‌ డేటా స్టోరేజ్‌ స్పేస్‌ను కౌంట్‌ చేయరని వాట్సాప్‌ తెలిపింది. దాంతో ఇది పలువురికి సంత్రుప్తి కలిగించే అంశంగా మారింది.

అదే సమయంలో ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు గూగుల్‌ డ్రైవ్‌ అప్‌డేట్‌ చేయకపోతే, వాట్సాప్‌ బ్యాకప్‌లన్నీ ఆటోమేటిక్‌గా తొలగించబడతాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆటో-డిలీట్‌ ఆప్షన్‌ నవంబర్‌ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. మాన్యువల్‌ బ్యాకప్‌ ద్వారానే మీ ఫైల్స్‌ను, మెసేజ్‌లను సురక్షితంగా ఉంచుకోవాలి. మీ చాట్స్‌ను అక్టోబర్‌ 30 లోపే మాన్యువల్‌ బ్యాకప్‌ చేసుకోవాలని ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ యూజర్లకు సూచించింది.

వాట్సప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. చాట్‌ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత చాట్‌బ్యాకప్‌ను క్లిక్‌ చేయాలి. యూజర్లు తమ ఫోన్‌ను మార్చినప్పుడు, కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను సెట్టింగ్‌ చేసుకోవడంతో పాటు పాత ఫోన్‌లోని చాట్లను బ్యాకప్‌ చేసుకోవచ్చు. కొత్త ఫోన్‌కు చాట్‌ డేటా అంతా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.అయితే గూగుల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకునే వాట్సాప్‌ చాట్‌లు, మెసేజ్‌లు ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ కాదని యూజర్లు గుర్తుంచుకోవాలి.






Related News

టిక్ టాక్.. బ్లాక్!

Spread the love ఇండియాలో ఎంతో పాప్యులర్ అయిన టిక్ టాక్ యాప్ యాక్సెస్ ను బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్Read More

వాయిస్ అసిస్టెంట్ తో న‌డిచే కారు వ‌చ్చేస్తోంది..!

Spread the love ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ త్వరలోనే హెక్టార్‌ పేరుతో ఓ ఎస్‌యూవీని మార్కెట్‌లోకిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *