వాట్సాప్ లో కొత్త ఆప్షన్

1469807832WhatsApp-Not-Delete-Conversations
Spread the love

వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌తో వాయిస్, వీడియో కాల్స్ తరచూ చేస్తున్న వారికి శుభవార్త. మరో కొత్త సదుపాయం మీకు అందుబాటులోకి రానుంది. సహజంగా ఎవరికైనా వాయిస్ కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వీడియో కాల్‌లో ఇద్దరూ చూసుకుంటూ మాట్లాడుకుంటే బాగుణ్ణు అన్పించడం సహజం. చాలా వాయిస్ కాల్స్ కొద్దిసేపటి తర్వాత వీడియో కాల్‌గా మారిపోతుంటాయి కూడా.

అలా వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్‌కు మారాలంటే ఇప్పటి వరకూ కాల్‌ను పెట్టేసి తిరిగి వీడియో కాల్‌ను ప్రారంభించవలసి వచ్చేది. ఇకపై ఆ ఇబ్బంది లేదు. నేరుగా వాయిస్ కాల్‌ను మాట్లాడే సమయంలోనే దాన్ని వీడియో కాల్‌గా మార్చుకునే అవకాశాన్ని వాట్సాప్ తీసుకు వచ్చింది. వాట్సాప్ బీటా వర్షన్ 2.17.163లో ఇది దర్శనమిచ్చింది. ఇలా వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్‌కు మారే సమయంలో అవతలి వ్యక్తికి దాన్ని అనుమతించాలా లేదా వీడియో కాల్‌కు మారడం ఇష్టం లేకపోతే తిరస్కరించాలా అన్నది స్క్రీన్ మీద ఆప్షన్ చూపుతుంది.

తరచూ వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకునే వారికి ఈ ఆప్షన్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే గ్రూప్ వాయిస్ కాల్స్ కూడా వస్తున్నాయి. దీంతో పాటు వీడియోను నేరుగా మ్యూట్ చేసే సదుపాయం కూడా వాట్సాప్ ప్రవేశ పెడుతోంది.






Related News

whatsapp

వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్

Spread the love వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీRead More

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి

Spread the loveన్యూ ఇయర్ దెబ్బకు వాట్సాప్ ఉక్కిరిబిక్కిరయ్యింది. మెసేజ్ ల వెల్లువతో తల్లడింది. చివరకు కొంత సేపు క్రాష్Read More

  • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
  • ఆపిల్ ధరలు పెరిగాయి..
  • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
  • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
  • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
  • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
  • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
  • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *