Main Menu

వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన

Spread the love

ట్విట్టర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొన్ని కీలక ప్రకటనలు చేసింది. హ్యాష్ ట్యాగ్ చేసిన సమయంలో వాడిన పదాల ఆధారంగా పలు పోస్టులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయ్యింది. ‘బైసెక్సువల్’ అనే హ్యాష్‌టాగ్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు, న్యూస్‌పై నిషేధం విధించింది. ఆ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న వాటిని బ్లాక్ చేసింది. దీంతోపాటు ‘Butt’, ‘boobs’ అనే పదాలను కూడా బ్లాక్ చేసింది. అయితే విచిత్రంగా ‘లెస్బియన్’, ‘గే’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న పొటోలు మాత్రం ఇంకా ట్విట్టర్‌లో దర్శనమిస్తున్నాయి.

అయితే ట్విట్టర్ తీరు మీద తీవ్ర దుమారం రేగుతోంది. తమను అడ్డుకోవడం అమానుషమంంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. తాను బైసెక్సువల్ నని , తన ఉనికి ఎలా అడ్డుకుంటారని కొందరు నిలదీస్తుండడం విశేషం. ట్విటర్ యాజమాన్యం ఉగ్రవాదులను, నాజీలను అనుమతిస్తుందని కానీ ప్రేమను మాత్రం అనుమతించదని మరికొందరు దుమ్మెత్తి పోశారు. ఇది తీవ్రమైన వివక్ష కిందకు వస్తుందని, తాము సైలెంట్‌గా ఉండే ప్రస్తక్తే లేదని హెచ్చరించారు.

చివరకు ట్వీట్ల దాడికి ట్విట్టర్ దిగివచ్చింది. నిర్ణయాన్ని మార్చుకుంది. చిన్నపాటి ఎర్రర్ తోనే అలాంటి సమస్య వచ్చిందని ప్రకటించింది. ఆయా పదాలను తొలగించేది లేదని, త్వరలోనే పునరుద్దరిస్తామని స్పష్టం చేసింది. దాంతో వ్యవహారం సర్థుమణుగుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.






Related News

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

ఫేస్ బుక్ వేధింపుల‌పై ఫిర్యాదు ఇలా..

Spread the loveఇంటర్నెట్‌ వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఇంటర్నెట్‌ ద్వారా జరిగేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *