వాట్సాప్, ఎఫ్ బీలకు సుప్రీం షాక్

whatsapp fb
Spread the love

సోష‌ల్ మీడియాల నెట్ వ‌ర్క్స్ ఫేస్ బుక్, వాట్స‌ప్ కు సుప్రీం కోర్టు ఝ‌ల‌కిచ్చింది. ఇష్టారాజ్యంగా సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాంలు యూజ‌ర్ల డేటాను థ‌ర్డ్ పార్టీకి అమ్ముకోవ‌డంపై సుప్రీం క‌న్నెర్ర చేసింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన యూజ‌ర్ల స‌మాచారంపై ఫేస్ బుక్, వాట్సప్ అనుస‌రిస్తున్న విధానాల‌ను సుప్రీం ప్ర‌శ్నించింది. దీనిపై నాలుగు వారాల్లో అఫిడివిట్ ను దాఖ‌లు చేయాల‌ని ఫేస్ బుక్, వాట్స‌ప్ ను ఆదేశించింది.

దీనిపై స్పందించిన ఫేస్ బుక్, వాట్స‌ప్ త‌రుపు న్యాయ‌వాదులు… ఏ కంపెనీకి యూజ‌ర్ డేటాను షేర్ చేయ‌డం లేద‌ని అయితే.. యూజ‌ర్ల‌కు సంబంధించిన లాస్ట్ సీన్, ఫోన్ నెంబ‌ర్, మొబైల్ డిటేయిల్స్ మాత్ర‌మే షేర్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. వాట్సప్ ప్రైవ‌సీ పాల‌సీ మీద కేసు వేసిన పిటిష‌న‌ర్లు మాత్రం వాట్స‌ప్ త‌మ యూజ‌ర్ల డేటాను ఫేస్ బుక్ తో పాటు వేరే కంపెనీల‌కు షేర్ చేస్తున్న‌ద‌ని సూట్ ఫైల్ చేశారు. దీనిపై వాదోప‌వాదాలు విన‌డానికి కోర్టు న‌వంబ‌ర్ 28వ తేదీని ఫిక్స్ చేసింది.

కొత్త కొత్త పుంత‌లు తొక్కుతున్న ఈ సాంకేతిక యుగంలో సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్స్ యూజ‌ర్ల డేటాను అమ్ముకోకుండా ఉండ‌టం కోసం, డేటా రక్ష‌ణ కోసం సుప్రీం కోర్టు మాజీ జ‌స్టిస్ బీఎన్ శ్రీకృష్ణ ఆధ్వ‌ర్యంలో ఓ క‌మిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. డేటా ర‌క్ష‌ణ పై ఈ క‌మిటీ అధ్య‌యనం చేసి సుప్రీం కోర్టుకు, కేంద్రానికి రిపోర్ట్ ఇస్తుంటుంది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా యూజ‌ర్ల డేటా త‌స్క‌ర‌ణ‌కు పాల్ప‌డే కంపెనీల‌కు సుప్రీం నోటీసులు జారీ చేస్తుంది.


Related News

AndroidPIT-whatsapp-video-call-0043-a-w782

వాట్సాప్ లో వచ్చేసింది…

Spread the loveవాట్సాప్ లో కొత్త ఆప్షన్ వచ్చేసింది. వీడియో కాలింగ్ గురించి ఊరిస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా అమలులోకిRead More

3045257-poster-p-1-a-new-nokia-phone-is-coming-in-2016

స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…

Spread the loveస్మార్ట్‌ఫోన్‌లు వ‌చ్చాక ప్ర‌పంచంలోని స‌మాచార‌మంతా అర‌చేతిలోకి వ‌చ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌లు పెరిగాక పోర్న్ చూడ‌డం కూడా విప‌రీతంగా పెరిగిపోయింది.Read More

 • వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్
 • వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి
 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
 • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *