స్యామ్ సంగ్ ఇండిపెండెన్స్ డే బంప‌రాఫ‌ర్

1467975349_samsung-galaxy-j2-2016
Spread the love

స్వాతంత్ర్య దినోతవ్సం సందర్భంగా మొబైల్‌ దిగ్గజం శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లపై బిగ్‌ డిస్కౌంట్లు, క్యాఫ్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్‌ 7, గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్ పై ఈ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు రూ.20వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటిలోనూఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ సేల్‌ లో భాగంగా, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్‌పై రూ. 8వేల క్యాష్‌ బ్యాక్‌ ( 64 జీబీ,128జీబీ రెండు వేరియంట్లు). దీనితో పాటు, ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ .12,000 వరకు అదనపు క్యాష్ బ్యాక్ లభ్యం. గాలక్సీ ఎస్ 7 ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు రూ .4వేల క్యాష్‌ బ్యాక్‌. రూ.12వేల దాకా ఎక్సేంజ్‌ ఆఫర్‌. అంతేకాదు ఈ స్వాతంత్ర్య దినోత్సవ అమ్మకాలల్లో భాగంగా రెండు ఫోన్లపై 24 నెలల వరకు ఈఎంఐ ఆఫర్‌.

కాగా గెలాక్సీ ఎస్‌ 7, గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్ ఇప్పటికీ శాంసంగ్‌ బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లుగా పరిగణించబడుతున్నాయి. ఈ ఫోన్లు గత ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్‌ 7 రూ .48,900, గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్ రూ .56,900 ధరలతో లాంచ్‌ అయ్యాయి.


Related News

whatsapp

వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్

Spread the love వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీRead More

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి

Spread the loveన్యూ ఇయర్ దెబ్బకు వాట్సాప్ ఉక్కిరిబిక్కిరయ్యింది. మెసేజ్ ల వెల్లువతో తల్లడింది. చివరకు కొంత సేపు క్రాష్Read More

 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
 • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
 • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *