శాంసంగ్ మొబైల్ ధరల తగ్గింపు

1467975349_samsung-galaxy-j2-2016
Spread the love

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ గత నెలలోనే గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను 4000 రూపాయల మేర తగ్గించింది. ఇప్పుడు మరోసారి ఇదే వేరియంట్‌పై రూ.5000మేర ధరను తగ్గించినట్టు శాంసంగ్‌ ప్రకటించింది. దీంతో గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌, 6జీబీ వేరియంట్‌ ధర రూ.65,900కు దిగొచ్చింది. దీంతో పాటు తీసుకొచ్చిన 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.64,900. 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ కంటే కేవలం 1000 రూపాయలే ఈ వేరియంట్‌ ధర ఎక్కువ. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ రిటైలర్లు లేదా ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ స్టోర్‌ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటును కంపెనీ కల్పిస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ ఫీచర్లు…
6.2 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
ఆక్టాకోర్‌ శాంసంగ్‌ ఎక్సీనోస్‌ 8895 ఎస్‌ఓసీ
6జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
హైబ్రిడ్‌ డ్యూయల్‌ సిమ్‌ కాన్ఫిగరేషన్‌
12 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ పిక్సెల్‌ రియర్‌ కెమెరాలు
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఐరిస్‌ స్కానర్‌, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, ఫేసియల్‌ రికగ్నైజేషన్‌
డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ68 సర్టిఫికేషన్‌


Related News

gionee phone

జియోనీ నయా ఫోన్

Spread the loveమార్కెట్లో నయా స్మార్ట్ ఫోన్ వస్తోంది. జియోనీ అప్ గ్రేడెడ్ మోడల్ ని రంగంలోకి తెస్తోంది. జియోనీRead More

bank

బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా

Spread the love ప్రత్యక్ష బ్యాంక్‌ సేవలకు ప్రత్యామ్నాయంగా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగంలోకి వస్తున్న పరిస్థితుల్లో కొన్ని విషయాలపైRead More

 • వాట్సాప్ లోనూ దాచుకోవచ్చు..!
 • జియోకి పోటీగా బీఎస్ఎన్ఎల్
 • మైక్రోమ్యాక్స్ న‌యా మొబైల్
 • గూగుల్ గూటికి మరో కంపెనీ
 • వాట్సాప్, ఎఫ్ బీలకు సుప్రీం షాక్
 • జియో డెలివరీ లేట్ ..!
 • యూ ట్యూబ్ కి కొత్త అందాలు
 • శాంసంగ్ మొబైల్ ధరల తగ్గింపు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *