ఎస్ సిరీస్ కొత్త ఫోన్: నీటిలో ప‌డినా ఫ‌ర్వాలేదు

samsung
Spread the love

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8 సిరీస్‌లో ఎస్‌8 యాక్టివ్‌ను లాంచ్‌ చేసింది. ఎన్నో లీకులు, అంచనాల తరువాత ఎట్టకేలకు గెలాక్స్‌ ఎస్‌ 8 యాక్టివ్‌ మన ముందుకు వచ్చింది. ప్రీ ఆర్డర్‌ ద్వారా ప్రస్తుతం ఎటీ అండ్‌ టీ లో ప్రత్యేకంగా లభించనుంది. ఆగస్టు 11 నుంచి స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. దీని ధర సుమారు రూ.54వేలుగా ఉండనుంది.

అంతేకాదు ఎటీఅండ్‌టీ క్యారియర్ ప్రొవైడర్ కస్టమర్లను ఆకర్షించడానికి కొన్ని రోజులపాటు ఆఫర్లను కూడా అందించనుంది. ఉదాహరణకు, కొనుగోలుదారు గెలాక్సీ S8 యాక్టివ్ తో పాటు శాంసంగ్‌ టీవీని కూడా ఆన్‌లైన్‌లో కొంటే రూ.32వేల తగ్గింపుతోపాటు డైరెక్ట్‌ టీవీ కనెక్ట్‌న్‌. ఎక్సేంజ్‌ ద్వారా దాదాపు రూ .12,700 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మెటోర్ గ్రే, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లోఅందుబాటులో ఉంటుంది. షట్టర్‌ ప్రూఫ్‌ స్క్రీన్‌ (5 అడుగుల ఎత్తునుంచి కింద పడినా పగలదు) మిలిటరీ గ్రేడ్‌ షీల్డింగ్‌, డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌ ( 5అడుగుల లోతు నీళ్లలో అరగంట నానినా పాడుకాదు) బిగ్గెస్ట్‌ హైలైట్‌గా నిలవనుంది. అంతేకాదు తీవ్రమైన ఉష్ణోగ్రత, దుమ్ము, షాక్ / కంపనం మరియు అల్ప పీడన / అధిక ఎత్తు సహా 21 ప్రత్యేకమైన పర్యావరణ పరిస్థితులల్లో MIL-STD-810G పరీక్షలు పాస్‌అయిందట.

గెలాక్స్‌ ఎస్‌ 8 యాక్టివ్‌
5.80 అంగుళాల సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే
2.35గిగాహెడ్జ్‌ ఎనిమిదో కోర్‌ ప్రాసెసర్
1440×2560 పిక్సెల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగాట్‌
12 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
8మెగాపిక్సెల్ ముందు కెమెరా
ఆండ్రాయిడ్‌ 7.0
4 జీబీ ర్యామ్‌
64జీబీ
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం


Related News

whatsapp

వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్

Spread the love వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీRead More

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి

Spread the loveన్యూ ఇయర్ దెబ్బకు వాట్సాప్ ఉక్కిరిబిక్కిరయ్యింది. మెసేజ్ ల వెల్లువతో తల్లడింది. చివరకు కొంత సేపు క్రాష్Read More

 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
 • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
 • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *