ట్విట్ట‌ర్ కి జీరో..!

twitter
Spread the love

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ శరవేగంగా దూసుకెళ్తుండగా… ట్విట్టర్‌ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాగా మారింది. ఈ ఏడాది తొలి క్వార్టర్‌ నుంచి ట్విట్టర్‌ ఒక్క యూజర్‌ను కూడా యాడ్‌ చేసుకోలేకపోయింది. రెండో క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించిన ట్విట్టర్‌, తన రెవెన్యూలు ఏడాది ఏడాదికి 5 శాతం పడిపోయి, 574 మిలియన్‌ డాలర్లుగా నమోదుచేసినట్టు తెలిపింది. ట్విట్టర్‌కు ప్రస్తుతం 328 మిలియన్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లున్నారు. 2017 తొలి క్వార్టర్‌లో కూడా ట్విట్టర్‌ ఇంతే మొత్తంలో యూజర్లను కలిగిఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కర్ని కూడా ట్విట్టర్‌ యాడ్‌ చేసుకోలేకపోయింది. ట్విట్టర్‌కు భిన్నంగా ఫేస్‌బుక్‌ రెండు బిలియన్‌ యూజర్ల మార్కును క్రాస్‌చేసింది.

వాట్సాప్‌ కూడా డైలీ 1 బిలియన్‌పైగా యూజర్లున్నట్టు తెలిపింది. ఇటు ఇన్‌స్టాగ్రామ్‌ కూడా యూజర్లను యాడ్‌ చేసుకోవడంలో దూసుకెళ్తోంది. కానీ ట్విట్టర్‌ పరిస్థితినే అధ్వాన్నంగా మారింది. అయితే నెలవారీ యాక్టివ్‌ యూసేజ్‌ ఏడాది ఏడాదికి 5 శాతం, డైలీ యాక్టివ్‌ యూసేజ్‌ 12 శాతం పెంపుదలను ట్విట్టర్‌ నమోదుచేసినట్టు కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే ప్రకటించారు. గత క్వార్టర్‌లో కూడా ఈ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డైలీ యాక్టివ్‌ యూసేజ్‌ వృద్ధిని 14 శాతం నమోదుచేసింది. కానీ కొత్త యూజర్లు మాత్రం ట్విట్టర్‌కు అందని ద్రాక్షాలా మారుతున్నారు. ట్విట్టర్‌ ప్రస్తుతం తన ప్లాట్‌ఫామ్‌పై వీడియో స్ట్రీమింగ్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. యూజర్‌ వృద్ధి మందగిస్తుండటంతో, ట్విట్టర్‌ కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్‌ కోసం అన్వేషణ ప్రారంభింస్తోంది.






Related News

whatsapp

వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్

Spread the love వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీRead More

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి

Spread the loveన్యూ ఇయర్ దెబ్బకు వాట్సాప్ ఉక్కిరిబిక్కిరయ్యింది. మెసేజ్ ల వెల్లువతో తల్లడింది. చివరకు కొంత సేపు క్రాష్Read More

  • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
  • ఆపిల్ ధరలు పెరిగాయి..
  • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
  • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
  • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
  • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
  • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
  • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *